బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలుపెట్టి అప్పుడే వారం రోజులు అయ్యింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్,, వరెస్ట్ పెర్ఫామర్స్ ఎంపిక, అలాగే కెప్టెన్సీ టాస్క్ లు ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి. ఇప్పుడు వీకండ్ వచ్చింది కాబట్టి శనివారం నాగార్జున హౌస్ మేట్స్ కి ఇచ్చే పంచ్ లు, ఆదివారం ఎలిమినేషన్ లో ఉండే ట్విస్ట్ లు ఆడియన్స్ లో ఉత్సాహాన్ని నింపుతాయి. అందుకే, ఇప్పుడు అందరూ వీకండ్ నాగార్జున ఎపిసోడ్ కోసమే ఎదురుచూస్తున్నారు.
ఇక ఈవారం నామినేన్స్ లిస్ట్ చూసినట్లయితే ఐధుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇందులో ఆరోహిరావ్, అభినయశ్రీ, శ్రీసత్య, ఇనయ సుల్తానా, ఫైమా , రేవంత్ ఇంకా చంటి ఉన్నారు. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ని బట్టీ చూస్తే ఈ ఏడుగురులో రేవంత్ టాప్ లో ఉన్నాడు. రేవంత్ దాదాపుగా 25 శాతం ఓటింగ్ వరకూ ప్రబావితం చేశాడు. ఆ తర్వాత ప్లేస్ లో చంటి , ఫైమా ఉన్నారు. వీరిద్దరూ దాదాపుగా 12 శాతం ఓటింగ్ ని ప్రభావితం చేశారు.
ఇక మిగిలి ఓటింగ్ శాతాన్ని నలుగురు పంచుకోవాల్సి వచ్చింది. వీరిలో ఆరోహి రావ్, శ్రీసత్య ఇద్దరూ సేఫ్ జోన్ లోనే ఉండేలా కనిపిస్తున్నారు. ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు. అభినయశ్రీ ఇంకా ఇనయ సుల్తానా. వీరిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. అభినయశ్రీ ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అవుతోంది. హౌస్ మేట్స్ తో కలుస్తోంది. కాబట్టి, అభినయశ్రీ ని అంత త్వరగా హౌస్ నుంచీ పంపించరు. ఇక మిగిలింది ఇనయ మాత్రమే.
కాబట్టి ఇనయ సుల్తానా వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఆర్జీవి అమ్మాయి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇక రెండురోజులు మాత్రమే ఓటింగ్ జరిగింది కాబట్టి, బిగ్ బాస్ ఈవారం సేఫ్ చేస్తే మాత్రం ఇనయ బ్రతికిపోతుంది. మరి ఆదివారం బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి అనేది చూడాల్సిందే. అదీ మేటర్.