Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షో నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఆమేనా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ సాగుతుండటంతో బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రోమోలు సైతం ప్రేక్షకులను అంచనాలను మించి ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన కంటెస్టెంట్లలో చాలామందికి ఓటింగ్స్ ఊహించని స్థాయిలో వస్తుండటం గమనార్హం. శోభాశెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, ప్రశాంత్, గౌతమ్, షకీలా, కిరణ్, దామిని నామినేషన్స్ లో ఉన్నారు. పల్లవి ప్రశాంత్ కు ఇతర కంటెస్టెంట్లతో పోల్చి చూస్తే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి.

కిరణ్ రాథోడ్ కు భాష సమస్య ఉండటంతో ఆమె తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిలవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కిరణ్ రాథోడ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్ షో నుంచి ఫస్ట్ వీక్ ఆమే ఎలిమినేట్ అవుతారా? లేక మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారా? అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

బిగ్ బాస్ షో నుంచి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మరి కొంతకాలం ఆగాల్సిందే. బిగ్ బాస్ షో సీజన్7 లో రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో హోస్ట్ గా నాగార్జున రేంజ్ ను మరింత పెంచుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బిగ్ బాస్ షో సీజన్7 (Bigg Boss 7 Telugu) కోసం ఈ షో నిర్వాహకులు కళ్లు చెదిరే స్థాయిలో ఖర్చు చేశారని సమాచారం. ఈ షో నిర్వాహకులకు లాభాలు రావాలంటే ఊహించని స్థాయిలో రేటింగ్స్ రావాల్సి ఉంటుంది. బిగ్ బాస్ షో సీజన్7 అంచనాలకు మించి సక్సెస్ సాధించాలని ఈ షో అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus