Venkatesh: ఇప్పటికీ వెంకటేష్ కెరీర్ లో అదే బెస్ట్ బుకింగ్ సినిమా అంట ..!

విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ జానర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని అందరూ అంటూ ఉంటారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయన క్రేజ్ ని మ్యాచ్ చేసిన హీరో ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఎవ్వరూ రాలేదు. కెరీర్ మొత్తం ఆయన కేవలం ఫ్యామిలీ జానర్ సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. మాస్ సినిమాలు , యూత్ ఫుల్ లవ్ స్టోరీలు మరియు ఫ్యాక్షన్ జానర్ చిత్రాలు కూడా చేసాడు. అన్ని జానర్స్ లోనూ విజయాలు దక్కాయి.

అదంతా పక్కన పెడితే (Venkatesh) వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ని వంద రెట్లు ఎక్కువ చేసిన చిత్రాలలో ఒకటి ‘కలిసుందాం రా’. ప్రముఖ దర్శకుడు ఉదయ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ లో మొట్టమొదటి 25 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకి సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ మురగదాస్ కూడా స్క్రిప్ట్ రైటింగ్ విభాగం లో ఒకడిగా పని చేసాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా తొలుత అంజలి జవేరి ని అనుకున్నారు.

ఆమెతో ఒక ఫోటో షూట్ చేసిన తర్వాత ఎందుకో డైరెక్టర్ కి పెద్దగా నచ్చలేదు. దీంతో వెంటనే సిమ్రాన్ ని సంప్రదించి ఆమెని ఈ చిత్రం లో హీరోయిన్ గా తీసుకున్నారు. నాలుగు కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 78 కేంద్రాలలో సంక్రాంతి కానుకగా విడుదలైంది. కుటుంబ సత్తా చిత్రం అవ్వడం , దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి ‘అన్నయ్య’ చిత్రం కూడా విడుదలవ్వడం తో ఇంత తక్కువ సెంటర్స్ లో విడుదల అవ్వాల్సి వచ్చింది.కానీ విడుదలైన ఆ 78 కేంద్రాలలో కూడా వంద రోజులు ఆడింది.

అప్పట్లో ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’ చిత్రం మాత్రమే ఈ స్థాయిలో విడుదలైన అన్నీ కేంద్రాలలో ఆడింది. ఆ తర్వాత అదే స్థాయిలో ఆడిన ఏకైక చిత్రం గా ‘కలిసుందాం రా’ చిత్రం నిల్చింది. అలాగే 14 సెంటర్లలో 175 రోజులు , 4 కేంద్రాలలో 200 రోజులు ఆడిన ఈ చిత్రం , పాతిక కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించిన చిత్రం గా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని అందుకుంది. ఇకపోతే అప్పట్లో ఈ చిత్రానికి రెండు కోట్ల 50 టికెట్స్ అమ్ముడుపోయాయట. ఇది ఆరోజుల్లో ఇండియా లోనే ఆల్ టైం రికార్డుగా నిల్చింది. ఇలా ఎన్నో అనితర సాధ్యమైన రికార్డ్స్ ని నెలకొల్పింది ఈ చిత్రం.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus