కొరియోగ్రాఫర్ చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఈయన ఆత్మహత్య విషయం తెలిసి ఇండస్ట్రీలో పలువురు డాన్సర్లు కొరియోగ్రాఫర్లు ఈయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొరియోగ్రాఫర్ చైతన్య చనిపోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన మరణానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను రికార్డ్ చేసి చనిపోయారు. తన మరణానికి కారణం తాను చేసిన అప్పులేనని చైతన్య మాస్టర్ తెలిపారు.
ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేస్తూ అప్పులు భారీగా పెరిగిపోయాయని అయితే తనకు అప్పు తీర్చే సత్తా ఉన్నప్పటికీ అప్పు ఇచ్చిన వారు తనపై ప్రెషర్ పెట్టడం వల్ల తాను ఏమీ చేయలేకపోతున్నానని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను అంటూ చైతన్య తన మరణానికి గల కారణాలను తెలియజేశారు. ఇలా చైతన్య మరణించడంతో పలువురు ఈయన మరణానికి గల కారణాలను ఆయన ఎందుకు అప్పులు చేశారో అనే విషయాల గురించి పలు విషయాలను తెలియజేస్తున్నారు.
డిసెంబర్ 31 రోజున ఈయన ఒక ఈవెంట్ ప్లాన్ చేశారని అయితే ఈవెంట్ కోసం ఆర్టిస్టులను పిలిచారు. చివరి నిమిషంలో వారు హ్యాండ్ ఇవ్వటం వల్లే ఆ ఈవెంట్ ఆర్గనైజర్లు తనకు డబ్బు ఇవ్వలేదని తెలిపారు.సుమారు వారి నుంచి ఏడు లక్షల వరకు డబ్బు రావాల్సి ఉండగా వారు ఇవ్వకపోవడంతో మిగిలిన ఆర్టిస్టులకు డబ్బు ఇవ్వడానికి అప్పులు చేశారని తెలుస్తుంది.
ఇలా ఇంత మొత్తంలో డబ్బును అప్పు చేసి ఆర్టిస్టులకు ఇచ్చారు. ఈ అప్పును తీర్చడం కోసం మరొకచోట అప్పు తీసుకువచ్చి అప్పు తీర్చే ప్రయత్నాలు చేశారు. ఇలా భారీగా వడ్డీలు పెరిగిపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తీసుకురావడం వల్లే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో చైతన్య మాస్టర్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా క్షణికావేశంలో ఈయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైంది కాదని పలువురు ఈయన మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.