బ్రహ్మానందం – మహేష్‌బాబు, త్రివిక్రమ్ – బ్రహ్మానందం.. టాలీవుడ్‌లో ఈ రెండు కాంబినేషన్ల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో వీళ్ల సినిమాలు ఓ లెవల్‌లో ఉంటాయి. ఆయా సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ, మహేష్‌బాబు టైమింగ్ అదిరిపోతాయి అంతే. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్ల గురించి ఎందుకు చర్చ అంటే.. ఈ రెండూ కలిపి ఒక సినిమా రాబోతోంది. అదేదో కొత్త సినిమా అనుకునేరు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘గుంటూరు కారం’ సినిమానే.
బ్రహ్మానందం – త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటే.. ‘అతడు’ నుండి చెప్పాలి. అందులో బ్రహ్మా వేసిన అల్లుడి పాత్ర అద్భుతం అని చెప్పాలి. ఆ తర్వాత ‘జల్సా’ సినిమాలో హెడ్ కానిస్టేబుల్ ప్రణవ్ ఇంకో అద్భుతం. పవన్ కల్యాణ్‌తో చేసిన కామెడీ మామూలుగా ఉండదు. ‘ఖలేజా’, ‘జులాయి’, ‘సన్ అఫ్ సత్యమూర్తి’ ఇలా ఒక్కో సినిమాలో బ్రహ్మీ ఒక్కో అవతారాన్ని చూడొచ్చు. అన్నింట్లో కమెడియనే.. కానీ ఒక్కోటి ఒక్కో రకం.
ఇక ఇదే తరహాలో మహేష్ బాబు సినిమాలు చూస్తే.. హీరోగా ‘రాజకుమారుడు’ సినిమాలో చేసింది చిన్న పాత్ర అయినా నవ్వించారు బ్రహ్మీ. ఆ తర్వాత దాదాపు చాలా సినిమాల్లో మహేష్‌తోపాటు నవ్వించారు ఆయన. ‘పోకిరి’, ‘దూకుడు’, ‘అతుడు’ ఇలా వరుసగా ఫన్ పండగ చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురూ కలసి నవ్వించబోతున్నారు. ‘గుంటూరు కారం’ సినిమాలో తొలుత బ్రహ్మానందంకు పాత్ర లేదట. కానీ ఉంటే బాగుంటుందని మహేష్ అనుకోవడంతో ఈ కాంబినేషన్ కుదిరిందట. మరి ఈ సారి బ్రహ్మం ఎలా కనిపిస్తారో చూడాలి.
ఇక ఈ సినిమా గురించి చూస్తే.. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆగుతూ ఆగుతూ జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల జోరందుకుంది. అయితే పూజా హెగ్డే తప్పుకోవడం/ తప్పించడంతో మరో హీరోయిన్‌కి చోటుంది. ఆ స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారని సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!