తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ .పన్నీర్‌సెల్వం – సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ కావడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని రజనీకాంత్ స్పష్టం చేశారు. గవర్నర్ పదవికి సంబంధించిన నిర్ణయం ఉన్నతాధికారుల చేతుల్లోనే ఉంటుందని రజనీ చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. రజనీకాంత్ ఇటీవల ఉత్తర భారత పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌లతో సహా ప్రముఖ రాజకీయ ప్రముఖులతో సమావేశమయ్యారని, ఆయన గవర్నర్‌గా నియమితులయ్యే అవకాశంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు చెలరేగడం గమనించదగ్గ విషయం
రజనీకాంత్ (Rajinikanth) గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడంపై జరుగుతున్న ఊహాగానాలపై రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ నర్మగర్భ వ్యక్తం చేశారు. రజనీకాంత్‌ను గవర్నర్‌గా నియమించడం అంతిమంగా దేవుడి చేతుల్లోనే ఉందని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. తనకు రాజకీయ రంగ ప్రవేశం చేసే ఉద్దేశం లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ఆదివారం మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైలర్ చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచి భారీ కలెక్షన్లను సాధిస్తూ రికార్డులను బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. రజనీకాంత్ తన కెరీర్‌లో అత్యున్నత బాక్సాఫీస్ రికార్డును ఖాతాలో వేసుకొన్నాడు. ఈ సినిమా తమిళ సినిమా రికార్డులను తిరగరాసింది.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్‌పై లేటెస్ట్‌గా అధికారక ప్రకటన విడుదలైంది. ఈ సినిమా సెప్టెంబరు 7 నుంచి తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఈ సినిమా తెలుగు తమిళం, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో అదే రోజు స్ట్రీమింగ్ కానుంది. దీంతో మరోసారి తమ అభిమాన నటుడి సినిమాను చూడోచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రజనీ ఫ్యాన్స్.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!