‘బిగిల్’ లో తీసేసారు ‘విజిల్’ సంగతేంటి..?

విజయ్ హీరోగా అట్లీ డైరెక్షన్లో వచ్చిన ‘బిగిల్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైనే గ్రాస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక తెలుగులో కూడా ఈ చిత్రం మంచి హిట్ అయ్యిందనే చెప్పొచ్చు. ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. అయితే మొదటి నుండీ ఈ చిత్రం పై ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. మొదటగా ఈ చిత్రం కథ విషయంలో ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ సీన్ పై వివాదాలు తలెత్తడంతో ఆ సీన్ ని డిలీట్ చేశారట.

ఇంతకీ ఆ సీన్ ఏంటంటే… తెలుగు వెర్షన్ ప్రకారం.. పోచమ్మ అనే లావుగా ఉండే అమ్మాయి క్యారెక్టర్ ను హేళన చేస్తూ హీరో కామెంట్స్ చేస్తాడు. దీంతో కసితో గేమ్ ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించినట్టు క్లయిమాక్స్ లో చూపిస్తారు. ఈ సీన్ కాస్త ఎటకారంగా ఉంది అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. స్థూలకాయంతో బాధపడుతున్న వారిని విమర్శిస్తూ వారి మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని.. వివాదాలు తలెత్తాయి. దీంతో ‘బిగిల్’ నుండీ ఆ సీన్ తీసేసారు. మరి ‘విజిల్’ లో తీసారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus