Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ విషయంలో మెగాభిమానుల టెన్షన్ ఏంటంటే..!

సినిమాల విషయంలో స్టార్ హీరోల అభిమానుల్ని కొన్ని కొన్ని సెంటిమెంట్స్ టెన్షన్ పెడుతుంటాయి.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌ని ఇప్పుడో సెంటిమెంట్ భయపెడుతుంది అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది.. అసలేంటా సెంటిమెంట్?.. మెగా ఫ్యాన్స్ ఎందుకు ‘వాల్తేరు వీరయ్య’ గురించి వర్రీ అవుతున్నారనేది ఇప్పుడు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా.. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’..

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.. టైటిల్ టీజర్‌కి, ‘బాస్ పార్టీ’ లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.. అయితే ఈ మూవీ రిజల్ట్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.. దానికి రీజన్ ఏంటంటే.. ‘ఆచార్య’ లో తండ్రి హీరోగా నటించగా.. తనయుడు చరణ్ కీలకపాత్రలో కనిపించాడు.. సినిమా ఫలితం ఏంటనేది అందరికీ తెలిసిందే..
ఇక మలయాళం ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు..

పాజిటివ్ టాక్, భారీ కలెెక్షన్లు వచ్చినా కానీ రిజల్ట్ మాత్రం హిట్ అనే రేంజ్‌లో రాలేదు.. అలా, చరణ్, సల్మాన్ సపోర్ట్ చేసిన ఈ రెండు సినిమాలూ పరాజయం పాలయ్యాయి.. దీంతో ఇప్పుడు మాస్ మహారాజా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఏమవుతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అభిమాని అయిన రవితేజ తను సినిమాల్లోకి రావడానికి కష్టపడి ‘స్వయంకృషి’తో సినిమా రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగిన చిరంజీవే కారణం అంటూ ఎన్నోసార్లు చెప్పాడు.

ఒకరకంగా రవితేజ చిరు ఫ్యాన్ అనడం కంటే భక్తుడు అనడం బెటర్ ఏమో.. అలాంటి తన అభిమాన నటుడితో కలిసి 2000 వ సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ‘అన్నయ్య’ మూవీలో చిరు తమ్ముడిగా యాక్ట్ చేశాడు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ చిరుతో తెరపంచుకుంటున్న సంగతి తెలిసిందే. రవితేజ ‘పవర్’ మూవీతో కె.ఎస్.రవీంద్ర (బాబీ) ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే..

‘వాల్తేరు వీరయ్య’ లో కథను మలుపుతిప్పే కీలకమైన పాత్రలో రవితేజ కనిపించనున్నాడట. అలాగే తన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లోనూ ఉంటుందట. సినిమా మొత్తం మీద 45 నిమిషాల పాటు మాస్ రాజా తెరమీద సందడి చేస్తాడట. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. సినిమాను సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus