నరేష్ హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ డైరెక్షన్లో తెరకెక్కిన ఆల్ టైం హిట్ చిత్రం ‘జంబలకిడిపంబ’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ఆమని. ఆ తరువాత ‘మిస్టర్ పెళ్ళాం’ ‘శుభలగ్నం’ ‘శుభమస్తు’ ‘మావిచిగురు’ ‘వంశానికొక్కడు’ ‘శుభ సంకల్పం’ వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ రోజుల్లో జగపతిబాబు, ఆమని .. కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉండేది. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమని..
కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఓ తమిళ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాంతో చాలా వరకూ సినిమాలను తగ్గించేసింది. అటు తరువాత తన భర్త నిర్మించిన చాలా సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. అప్పుల పాలయ్యాడట. ఆ టైములో వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారట. ఒకానొకసారి అయితే ఆమని భర్త సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడట. దాంతో ఇక ఎటూ తోచక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందట ఆమని.
హరికృష్ణ హీరోగా నటించిన ‘స్వామి’, రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘మధ్యాహ్నం హత్య’, రాజేంద్రసాద్ ‘ఆ నలుగురు’, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వచ్చిన ‘చందమామ కథలు’, నాని హీరోగా వచ్చిన ‘ఎం.సి.ఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి)’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’, రామ్ నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి చిత్రాల్లో నటించింది ఆమని. ముఖ్యంగా ‘చందమామ కథలు’ చిత్రంలో సీనియర్ హీరో నరేష్ కు లిప్ లాక్ ఇచ్చే సన్నివేశంలో కూడా నటించింది ఆమని.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!