నాగార్జున, రాజ శేఖర్‌లకు డిజాస్టర్ ఇచ్చిన ఆ డైరెక్టర్ ఎవరంటే..?

  • November 30, 2022 / 03:51 PM IST

ఎస్.వి. రాజేంద్ర సింగ్ బాబు.. అప్పటికే కన్నడలో స్టార్ డైరెక్టర్.. హిందీలోనూ సినిమాలు చేశారు. ఆయన ఫస్ట్ హిందీ పిక్చర్ సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో, పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ మీద కృష్ణ తమ్ముడు జి. ఆదిశేషగిరి రావు నిర్మించారు. జితేంద్ర, హేమ మాలిని మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కించిన ఈ ‘మేరీ ఆవాజ్ సునో’ మూవీ అంతకుముందు కన్నడలో రాజేంద్ర సింగ్ డైరెక్ట్ చేసిన ‘అంత’ చిత్రానికి రీమేక్. అక్కినేని నాగర్జున, అమల జంటగా ‘ప్రేమయుద్ధం’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

తర్వాత యాంగ్రీ యంగ్ మెన్ డా. రాజ శేఖర్, రంభ జంటగా.. అగ్రనిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌లో ‘మెకానిక్ మావయ్య’ అనే సోషియో ఫాంటసీ ఫిలిం స్టార్ట్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఫ్యామిలీ డ్రామాలో ఫాంటసీని కలిపి కథ అల్లారు. భారీ బడ్జెట్, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో బాగా భారీగానే తీశారు. బ్రహ్మానందం, ఏవీఎస్, ఎస్.పి.బాలు, పరేష్ రావల్, నూతన్ ప్రసాద్ లాంటి భారీ తారాగణం.. టాప్ టెక్నీషియన్లను తీసుకున్నారు. సినిమా ఓపెనింగ్ రోజు డైరెక్టర్..

ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్ రాలేదని.. హాలీవుడ్‌లో స్పీల్‌బర్గ్ చేసే సినిమాలు మనం కూడా చేయగలమని ఈ చిత్రంతో నిరూపించబోతున్నామని చెప్పుకొచ్చారు. అజయ్ శాంతితో కలిసి దర్శకుడు కథ రెడీ చేశారు. రామోజీ ఫిలిం సిటీలోనే గ్రాఫిక్స్ వర్క్ అంతా చేశారు. మిలీనియం ఇయర్ 2000లో రిలీజ్ చేశారు. దెబ్బకి థియేటర్లలో నుండి జనాలు పరుగో పరుగు.. ఇక్కడ దర్శకులు లేనట్టు కన్నడ నుండి తీసుకొచ్చింది ఇలాంటి కళాఖండం తియ్యడానికా?

అంటూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ గుసగుసలు వినిపించాయి. రాజ శేఖర్ ‘శివయ్య’ హిట్ కావడంతో మంచి ఊపులో ఉన్న టైంలో ఈ డిజాస్టర్ వచ్చి పడింది.. ప్రేక్షకులు నెత్తిన చేతులేసుకుని మరీ హాళ్లనుండి దౌడు తీసే రేంజులో టార్చర్ చేశారు రాజేంద్ర సింగ్.. ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఎలాంటి ప్రయోగాలు చేయలేదు కానీ.. కన్నడ, హిందీలో దర్శక నిర్మాతగా వరుసగా సినిమాలు చేశారు..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus