Sreeleela: స్పాట్ లోనే శ్రీ లీలకు రెండు కోట్లు ఇచ్చిన హీరో ఎందుకో అంత ఇంట్రెస్ట్!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి వారిలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒకరు. ఈమె హీరోయిన్గా దాదాపు పది సినిమాలకు పైగా అవకాశాలు అందుకొని ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్త్రీ లీల మరోసారి తన నటనతో అందరిని మెప్పించింది. ఇక త్వరలోనే బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే తాజాగా నటి శ్రీలీల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీ లీల కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల నుంచి మొదలుకొని యంగ్ హీరోల సినిమాలలో కూడా ఈమె నటిస్తూ బిజీగా ఉన్నారు.

అయితే ఓ యంగ్ హీరో సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉందట .అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత తన పాత్ర ప్రాధాన్యత తెలుసుకున్నటువంటి శ్రీ లీల నిర్మాత వద్దకు వెళ్లి తనకు మరో రెండు కోట్లు అదనంగా రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేశారట. అప్పటికే బడ్జెట్ మొత్తం ఫిక్స్ అయినటువంటి నిర్మాత రెండు కోట్లు అంటే తను ఇవ్వలేనని చెప్పడమే కాకుండా ప్రస్తుత రెమ్యూనరేషన్ తో సినిమాలో నటించే లాగా ఉంటే నటించమని లేకపోతే తప్పుకొమ్మని కూడా చెప్పారట.

ఈ విధంగా శ్రీ లీలని (Sreeleela) నిర్మాత ఏకంగా తప్పుకొమ్మని చెప్పడంతో ఆ యంగ్ హీరో ఈమె పై ఉన్న ఇష్టంతో నిర్మాత వద్దకు వెళ్లి ఈ సినిమాలో హీరోయిన్గా ఈమె ఉండాలి వేరే వాళ్ళు రావడానికి వీలులేదు కావాలంటే నా రెమ్యూనరేషన్ లో నుంచి రెండు కోట్ల రూపాయలు తీసి శ్రీలీలకు ఇవ్వమని స్పాట్లో తనకు రెండు కోట్ల రూపాయలను గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. ఇలా ఆ హీరో రెండు కోట్లు ఇవ్వడంతో అసలు శ్రీలీలపై ఈయనకు ఎందుకంత ఇంట్రెస్ట్ అంటూ సినిమా సెట్ లో అందరూ వీరి గురించి మాట్లాడటం గమనార్హం.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus