వెండితెరను కాన్వాస్‌గా చేసుకుని పెయింటింగ్స్ గీసిన చిత్రకారుడు. తన దృశ్య కావ్యాలతో మౌనరాగాలు ఆలపించి.. ప్రేక్షకుల గుండెల్లో రోజా పూలు పూయించిన దళపతి. కళాఖండాల్లాంటి సినిమాలతో భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం. ఆయనే వన్ అండ్ ఓన్లీ మణిరత్నం. ప్రయోగానికి కమర్షియల్ హంగులు జోడించి తన సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. పేరుకి తమిళ్ దర్శకుడే అయినప్పటికీ సౌత్ టూ నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోను సినిమాలు చేసి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. జీవితంలో ఒక్కసారైనా మణిరత్నంతో వర్క్ చేస్తే చాలు అనుకునే నటీనటులు ఎందరో.
అలాంటి దర్శకుడు పిలిచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదంటారా..? కానీ ఒక స్టార్ హీరో మాత్రం కాదన్నాడట. ఆయన ఎవరో కాదు విలక్షణ నటుడు విక్రమ్. ఇప్పుడంటే ఆయన పెద్ద స్టార్ కానీ 90వ దశకంలో విక్రమ్ చిన్న హీరో మాత్రమే. ఇక అసలు విషయానికి వస్తే.. మణిరత్నం సినిమాల్లో ఎవర్ గ్రీన్‌గా నిలిచే చిత్రం ‘‘బొంబాయి’’. మత సామరస్యానికి, హిందూ- ముస్లింల మధ్య సోదరభావానికి ప్రతీకగా ఈ చిత్రాన్ని చెప్పుకుంటారు. 1993లో యావత్ దేశాన్ని కుదిపేసిన బాబ్రీ మసీదు కూల్చివేత ఉదంతం ఆధారంగా మణిరత్నం రోజా సినిమా కథను సిద్ధం చేసుకున్నారు.
అలా తొలుత విక్రమ్ దగ్గరకెళ్లి నటించమని కోరాట. అయితే ఎందకో ఆయన ఈ కథను రిజెక్ట్ చేశాడట. దీంతో ఆ అదృష్టం అరవింద్ స్వామిని వరించింది. ఇక తర్వాతి కథ అందరికీ తెలిసిందే. 1995 మార్చి 10న విడుదలైన ‘‘బొంబాయి’’ ఘన విజయం సాధించింది. మనీషా కొయిరాల అందం, పాటలకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఇక అరవింద్ స్వామి అయితే అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. తమకు కాబోయే భర్త అచ్చం అరవింద్ స్వామిలా వుండాలని కోరుకున్నారంటే అతిశయోక్తి కాదు.