Pooja Hegde: ఆ ఇద్దరు డైరెక్టర్లు పూజా హెగ్డేనే నమ్ముకున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే కెరీర్ తొలినాళ్లలో ఫ్లాపులతో ఇబ్బంది పడినా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. గతేడాది వరకు వరుస విజయాలను అందుకున్న పూజా హెగ్డేకు ఈ ఏడాది రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాల ఫలితాలతో వరుస షాకులు తగిలాయి. కొన్ని వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలలో ఏ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.

ఎఫ్3 సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయగా ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే త్రివిక్రమ్, హరీష్ శంకర్ మాత్రం తమ సినిమాలలో వరుసగా పూజా హెగ్డేకు ఛాన్స్ లు ఇస్తున్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో కూడా హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండటం గమనార్హం. అదే సమయంలో దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం,

గద్దలకొండ గణేష్ సినిమాలలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా హరీశ్ శంకర్ తర్వాత సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. త్రివిక్రమ్ , హరీశ్ శంకర్ తమ ప్రాజెక్ట్ లలో పూజా హెగ్డేకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే 2023లో పూజా హెగ్డే సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పూజా హెగ్డే రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా పూజా హెగ్డే నటించిన సినిమాలకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుండటంతో దర్శకనిర్మాతలు ఆమెకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగులో సక్సెస్ అయిన పూజా హెగ్డే తమిళంలో మాత్రం సక్సెస్ సాధించలేదు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus