Vv Vinayak: వినాయక్ ను పెద్ద హీరోలు పట్టించుకోకపోవడానికి. కారణం అదేనట..!

వి.వి.వినాయక్ టాలీవుడ్లో ఉన్న బడా దర్శకుల్లో ఒకరు. ఒకప్పుడు రాజమౌళికి.. ధీటుగా సినిమాలు చేసేవాడు. సక్సెస్ లు కొట్టేవాడు. రాజమౌళి కంటే ముందే స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన దర్శకుడు. మాస్ ఆడియన్స్ లో కూడా రాజమౌళి కంటే ముందే వినాయక్ పాపులారిటీనీ సంపాదించుకున్నాడు. డైరెక్టర్స్ కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే మాట వినాయక్ ఎంటర్ అయ్యాకే వినిపించింది. అలాంటి వినాయక్ ఇప్పుడు ఫేడౌట్ అయిపోయాడు అని చాలా మంది అంటున్నారు.

2018 లో చేసిన ఇంటిలిజెంట్.. తర్వాత వినాయక్ నుండీ సినిమా రాలేదు. ఆ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఛత్రపతి ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు..కానీ ఆ సినిమాకి కూడా బజ్ ఏర్పడలేదు. వీటి వల్లే వినాయక్ ఫేడౌట్ అయిపోయాడు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అసలు సమస్య అది కాదు. వినాయక్ కు ఓ పెద్ద మైనస్ ఉంది. అదేంటి అంటే.. తన సినిమాకి తను మంచి కథ రాసుకోలేడు.

వినాయక్ (Vv Vinayak) తీసిన సినిమాలు అన్నీ వేరే రచయితల సాయంతో తీసినవే. ఇప్పుడు వినాయక్ దగ్గర పనిచేసిన చాలా మంది దర్శకులుగా మారిపోయారు. చిరు, బాలయ్య … వినాయక్ తో సినిమాలు చేయడానికి రెడీ. కానీ వినాయక్ వాళ్ళకు కథలు సెట్ చేయలేకపోతున్నాడు. ఈ మధ్యనే చిరు ఓ రచయిత వద్ద కథ ఓకె చేశారు.

వినాయక్ ను డైరెక్ట్ చేయమని అడిగారు. కానీ వినాయక్ హిందీ ఛత్రపతి రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే ఆ రచయితనే డైరెక్షన్ కూడా చేసేయమని అన్నారట. అలా వినాయక్ కు డైరెక్షన్ ఛాన్స్ లు మిస్ అయిపోతున్నాయి అని ఇన్సైడ్ టాక్.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus