మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తూ ‘ఉప్పెన’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి తప్ప.. షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేద్దాం అని నిర్మాతలు అనుకున్నారు… కానీ కరోనా వైరస్ దెబ్బకొట్టింది. 5 నెలలుగా థియేటర్లు తెరుచుకోలేదు కాబట్టి ఈ సినిమాకు మోక్షం కలుగలేదు.
‘మైత్రి మూవీ మేకర్స్’ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఉప్పెన’ కు నిర్మాతలు 25 కోట్లు బడ్జెట్ పెట్టారు. థియేటర్ లు తెరుచుకోవడం లేని పక్షంలో ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారట. నాని ‘వి’ సినిమాని కూడా ఓటిటి లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని 32 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వారు తీసుకున్నారు.
నాని మార్కెట్ 30 కోట్లు ఉంది కాబట్టి … ఆ చిత్రానికి అంత పలికింది. అయితే ‘ఉప్పెన’ చిత్రానికి 13 కోట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నారట అమెజాన్ వారు. ఇక శాటిలైట్ రైట్స్ మరియు డబ్బింగ్ రైట్స్ కలుపుకుంటే మరో 6 కోట్లు వచ్చే అవకాశం ఉందట. ఆ రకంగా చూసుకుంటే ‘ఉప్పెన’ నిర్మాతలకు 6 కోట్లు నష్టం వచ్చినట్టే..! అందుకే థియేటర్లు తెరుచుకునే వరకూ వేచి చూడటం మంచిదని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!