Pushpa Movie: ‘పుష్ప’ లో మొగిలీస్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’.. మొదట డివైడ్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగానే రాణించింది. పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం పక్క రాష్ట్రాల్లోని బయ్యర్లకి మంచి లాభాలను అందించింది. ఒక్క ఏపిలో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ‘పుష్ప’ సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం ‘బాహుబలి’ ‘సాహో’ తర్వాత అత్యథిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు చిత్రంగా రికార్డులు సృష్టించింది.

నిజానికి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చెయ్యాలనే ఉద్దేశం మొదట దర్శకుడు సుకుమార్ కు లేదు. ఈ టైములో పాన్ ఇండియా లెవెల్లో ఓ మూవీని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అంటే అది ఒక్కడితే అయ్యే పని కాదు. అందుకే ‘పుష్ప’ టీం అందరినీ అభినందించాల్సిందే. మరీ ముఖ్యంగా ఇందులో నటించిన నటీనటులకు భీభత్సమైన ఫాలోయింగ్ దక్కింది. సునీల్, అనసూయ లతో పాటు.. అనసూయ తమ్ముడు మొగిలీస్ పాత్రని పోషించిన వ్యక్తికి చాలా మంచి గుర్తింపు దక్కింది.

నోట్లో బ్లేడు పెట్టుకుని ఇతను పండించిన విలనిజం అందరినీ ఆకట్టుకుంది. ‘భయపడుతున్నాడు వీడు’ అంటూ ఇతను చెప్పిన డైలాగ్ కూడా బాగా పండింది.విలన్ గా నటించిన సునీల్ కనిపించిన ప్రతీసారి ఇతను కూడా కనిపిస్తాడు. ‘పుష్ప’ ఓటిటిలో రిలీజ్ అయ్యాక ఇతని గురించి సెర్చింగ్ లు ఎక్కువగా జరిగాయి. ఇతని అసలు పేరు రాజ్ తిరందసు. ‘పుష్ప’ కంటే ముందు ఇతను ‘కొత్త పోరడు’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

‘ఆహా’ ఓటిటిలో అది విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ‘పుష్ప’ లో ఇతనికి ఛాన్స్ రావడానికి కూడా ఆ వెబ్ సిరీసే కారణమని చెప్పాలి.అందులో ఇతని నటనకి మెచ్చి సుకుమార్ ‘పుష్ప’ లో తీసుకున్నాడు. ఇక ‘పుష్ప’ తర్వాత రాజ్ తిరందసు… నిఖిల్ హీరోగా నటిస్తున్న ’18 పేజెస్’ లో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీకి కూడా సుకుమార్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే..!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus