‘సర్కారు వారి పాట’ లో కీర్తి ఫ్రెండ్ గా చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?

సర్కారు వారి పాట.. ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్నా.. బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేస్తూ దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు కానీ.. ఇప్పటికైతే ఈ మూవీ బాగానే రాణిస్తుంది. ఈ సినిమాలో కళావతి అనే పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. ఫస్ట్ హాఫ్ లో ఆమె మహేష్ ను పామ్పర్ చేసి డబ్బులు కొట్టేసే అమ్మాయిగా నటించింది. ఆమె పక్కన అంటే కళావతి ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి కూడా హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోదు అనే చెప్పాలి.

అంత కళకళలాడుతున్న అమ్మాయి ఎవరు? ఆమెకి ఇదే మొదటి సినిమానా? లేక ఇంతకు ముందు ఏదైనా సినిమాలో నటించిందా అంటూ నెట్టింట్లో ఆ అమ్మడి గురించి జెల్లెడపడుతున్నారు నెటిజన్లు. నిజానికి ఆ అమ్మాయి కూడా హీరోయినే. ప్రస్తుతం ‘టాక్సీ’ ‘లెహరాయి’ అనే సినిమాల్లో నటిస్తుంది. త్వరలోనే ఆ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈమె పేరు సౌమ్య మీనన్. ‘సర్కారు వారి పాట’ లో కూడా ఆమె పాత్ర పేరు సౌమ్యనే..! ఈమె మలయాళీ.

అక్కడ అరడజను పైగా సినిమాల్లో నటించింది. ‘సర్కారు వారి పాట’ లో ఫస్ట్ హాఫ్ వరకు ఈమె కనిపిస్తుంది. కీర్తి సురేష్ ను ఎంకరేజ్ చేసి మహేష్ వద్ద డబ్బులు కొట్టేయమని పేమ్పర్ చేసేది ఈ అమ్మాయే. ఈమె పాత్ర వల్లే కథ కీలక మలుపు తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ లో ఈమె కనిపించదు. మొత్తానికి ఈ సినిమా ఆ అమ్మడి కెరీర్ కు ఉపయోగపడే ఛాన్స్ ఉంది. ఈమె లుక్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి బ్రేక్ వస్తే టాప్ ప్లేస్ లో ఉంటుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus