హిందీ ‘ఛత్రపతి’ కి ‘నేను స్టూడెంట్ సర్’ కి ఉన్న కామన్ పాయింట్ ని గమనించారా?

బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ గత ఏడాది వచ్చిన ‘స్వాతి ముత్యం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకి మంచి టాక్ అయితే వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఇప్పుడు గణేష్ నటించిన రెండో చిత్రం… ‘నేను స్టూడెంట్ సర్’ కూడా రిలీజ్ కు రెడీ అయ్యింది. ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పై గణేష్ చాలా ఆశలే పెట్టుకున్నాడు.

కచ్చితంగా హిట్టు కొట్టాలని భావించి ఈ సినిమా చేశాడు. టీజర్, ట్రైలర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్ తోనే ఈ మూవీ రూపొందినట్లు అనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ‘నేను స్టూడెంట్ సర్’ కి ఇటీవల వచ్చిన గణేష్ అన్న శ్రీనివాస్ నటించిన ‘ఛత్రపతి'(హిందీ) కి ఓ సిమిలర్ పాయింట్ ఉంది. అదేంటి అంటే ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ ఆ చిత్రంలో శ్రీనివాస్ కు తల్లి పాత్రలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఇప్పుడు ఆమె కూతురు అవంతిక దస్సాని గణేష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెకిదే మొదటి చిత్రం. జూన్ 2న విడుదల ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ‘అన్నకి తల్లి కలిసిరాలేదు.. తమ్ముడికి కూతురు కలిసొస్తుందా?’ అంటూ ముచ్చటించుకుంటున్నారు.

ఆల్రెడీ ఈమె ‘మిత్య’ అనే వెబ్ సిరీస్ తో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ సిరీస్ లో ఈమె పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. ఈమె లుక్స్ అయితే బాగానే ఉన్నాయి. నటన పరంగా ఎంత వరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus