బాలయ్య – సింగీతంల ‘ఆదిత్య 369’ లో టైమ్ మిషన్‌కి ఎంత ఖర్చయ్యిందంటే!

కొన్ని సినిమాలు వస్తాయి.. ఆడతాయి, వెళ్లి పోతాయి.. కొన్ని చిత్రాలు మాత్రమే చరిత్ర సృష్టిస్తాయి.. చరిత్రలో నిలిచిపోతాయి.. బ్లాక్ అండ్ కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలోనే జానపద బ్రహ్మ విఠలా చార్య వంటి వారు, మార్కస్ భాట్లే వంటి వారు తెలుగు చిత్రాలకు ఆధునిక హంగులద్ది ఆశ్చర్యపరిచారు.. అలా ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలొచ్చాయి.. తర్వాత కాలంలో కథ, సాంకేతికత, ఆలోచనల పరంగా అబ్బురపరిచింది ‘ఆదిత్య 369’..

సింగీతం శ్రీనివాస రావు సరికొత్త టైమ్ మిషన్‌ని కనిపెట్టి.. వర్తమాన భూత, భవిష్యత్ కాలాలకు సంబంధించిన కథ, సోషియో ఫాంటసీకి క్రైమ్ నేపథ్యాన్ని జత చేసి ఆయన తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పుడు చూసినా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. బాలకృష్ణ, మోహిని (తొలి పరిచయం), అమ్రిష్ పూరి, మాస్టర్ తరుణ్, గొల్లపూడి, చంద్ర మోహన్, సిల్ స్మిత, సుత్తి వేలు, టినూ ఆనంద్, అన్నపూర్ణ, కిన్నెర వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు.. ఓ ప్రొఫెసర్ కనిపెట్టిన టైమ్ మిషన్‌లో ప్రయాణిస్తూ..

హీరో హీరోయిన్లు భూత కాలంలోని శ్రీకృష్ణ దేవరాయలు కాలంలోకి, అక్కడి నుండి వర్తమానంలోకి.. అటునుండి భవిష్యత్తులోకి వెళ్తారు.. ఇక శ్రీకృష్ణ దేవ రాయలుగా బాలయ్య రాజసం, తేజస్సు, నటన.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించాయి.. కథలో ఇంత కీలకమైన ఈ టైమ్ మెషీన్ కంప్యూటర్ల సాయంతో దానంతటదే రివాల్వు అవ్వడం, స్మోక్ రావడం, గాల్లో ఎగరడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి.. ఈ టైమ్ మిషన్‌ని తయారు చేయడానికి అక్షరాలా రూ. 5 లక్షలు ఖర్చు పెట్టారు..

అప్పట్లో ఇది పెద్ద మొత్తమే.. ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగా నేతృత్వంలో.. సింగీతం తనకు కావలసినట్టు ఈ టైమ్ మిషన్‌ను తయారు చేయించుకున్నారు.. ఇన్ని ప్రత్యేకతలతో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ ఇండియాలోని సైన్ ఫిక్షన్ సినిమాల్లో ల్యాండ్ మార్క్ ఫిలింగా నిలిచింది.. సినిమాటోగ్రఫీ, సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లాయి.. ఎవర్ గ్రీన్ మూవీగా నిలిపాయి..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus