కొత్త కారు కొన్న ప్రభాస్…వైరల్ అవుతున్న ఫోటోలు.. !

ప్రభాస్ కొత్త కారు కొన్నాడు.దీని పేరు లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ అని తెలుస్తుంది. ప్రస్తుతం దీని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశంలోనే ఈ కారుని కొనుగోలు చేసిన రెండో వ్యక్తి ప్రభాస్ కావడం విశేషం.మార్చి 28న ఈ కారు హైదరాబాద్ కు వస్తోందని సమాచారం.దీని ధర 7 కోట్లు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఆల్రెడీ ప్రభాస్ దగ్గర BMW 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్‌ ఎక్స్‌జేఎల్‌, రేంజ్‌ రోవర్‌ వోగ్‌, రోల్స్‌ రాయ్స్‌ గోస్ట్ వంటి విలువైన‌ కార్లు ఉన్నాయి.

ఇప్పుడు ఈ లిస్ట్ లోకి లంబోర్గీని జాయిన్ అయినట్టు స్పష్టమవుతుంది. ఈ మధ్యే ప్రభాస్ ముంబై లో 50 కోట్లు పెట్టి ఓ ఇల్లు కొన్నాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.70 కోట్లు పారితషికం తీసుకుంటున్నాడు. అతనికి ఇలాంటివి కొనుగోలు చెయ్యడం ఓ లెక్కా. షూటింగ్ నిమిత్తం ఈ కార్లను ప్రభాస్ ఉపయోగించడట. దానికోసం పాత కార్లనే ఉపయోగిస్తాడని తెలుస్తుంది.

ప్రభాస్ నుండీ రాబోతున్న రాధే శ్యామ్ చిత్రంలో కూడా ప్రభాస్ వింటేజ్ కార్లను కలెక్ట్ చేసే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. నిజజీవితంలో కూడా ప్రభాస్ కు కార్ల పిచ్చి ఎక్కువేనని టాక్. ఇక ప్రస్తుతం ఆదిపురుష్ మరియు సలార్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ప్రభాస్ ఆ తరువాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో పాన్ వరల్డ్ మూవీని చెయ్యడానికి కూడా రెడీ అవుతున్నాడు.

1

2

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus