‘వైకుంఠపురం’ జోరు మామూలుగా లేదు…

2020 సంక్రాంతికి వచ్చిన సినిమాల మధ్య పోటీ ఎలా ఉందో మనం చూసేశాం. రెండూ విజయం అందుకోవడం, నిర్మాతల గల్లాపెట్టెలు నింపడం మనం చూశాం. సోషల్ మీడియాలో ఆయా సినిమాలకు ట్వీట్ల, పోస్టుల, వ్యూస్‌ పోటీ కూడా రంజుగా సాగింది. ఆ తర్వాత ఓటీటీల్లో వ్యూస్‌ పోటీ కూడా అదే స్థాయిలో కనిపించింది. యూట్యూబ్‌లో పాటల వ్యూస్‌లో మాత్రం ‘అల వైకుంఠపురములో..’ దే పై చేయి. ఇప్పుడు జియోసావన్‌ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్‌లోనూ దానిదే పై చేయి. ఈ ఏడాది ఎక్కువమంది విన్న పాటల ఆల్బమ్స్‌ (సినిమా పేరు) వివరాలను జియోసావన్‌ ఇటీవల విడుదల చేసింది. అందులో తొలి స్థానంలో బన్నీ – త్రివిక్రమ్‌- తమన్‌ మ్యాజిక్‌ నిలిచింది.

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో ఏది బాగుంది అంటే చాలామంది రెండూ అనే చెబుతారు. అంతలా ఆకట్టుకున్నాయి మరి. అదే పాటల విషయంలో అంటే మాత్రం ‘అల వైకుంఠపురములో’ అనే చెబుతారు. ఎంతగా అంటే జియో సావన్‌లో ‘అల..’ సినిమాకు సుమారు 179 మిలియన్ల స్ట్రీమ్స్‌ ఉన్నాయి. అదే ‘సరిలేరు నీకెవ్వరు’కు అయితే సుమారు 74 మిలియన్ల స్ట్రీమ్స్‌ ఉన్నాయి. అంటే మహేష్‌ కంటే బన్నీ 100 మిలియన్లకుపైగా స్ట్రీమ్స్‌ ఎక్కువగా వచ్చాయి. తమన్‌ మ్యూజిక్‌ మ్యాజిక్‌ అలాంటిది మరి.

ఇక జియో స్ట్రీమింగ్‌ టాప్‌ 5లో మిగిలిన సినిమాలు చూస్తే మూడో స్థానంలో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, నాలుగో స్థానంలో ‘ఉప్పెన’, ఐదో స్థానంలో ‘వి’ నిలిచాయి. ఇక టాప్‌ 5 సింగర్స్‌ చూస్తే దివంగత ఎస్పీబాలసుబ్రహ్మణ్యం (221 మిలియన్లు), సిద్‌ శ్రీరామ్‌ (165 మి.), చిత్ర (145 మి), అనురాగ్‌ కులకర్ణి (127.5 మి), దేవిశ్రీప్రసాద్‌ (122.9 మి.) తొలి ఐదు స్థానాల్లో నిలిచారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus