తెలుగు సినీ పరిశ్రమలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు నటుడు అందుకోని బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు బన్నీ. ఇక ఈసారి నేషనల్ అవార్డులలో ఎక్కువగా మెగా హీరోలు నటించిన సినిమాలకే ఈ అవార్డ్స్ రావడం విశేషం. బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా రావడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ సంతోషంలో ఉంది. వెంటనే చిరు సోషల్ మీడియా వేదికగా బన్నీకి స్పెషల్ విషెస్ తెలుపగా..
వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ బన్నీ ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా స్పందించారు. శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ తోపాటు.. పుష్ప, కొండపొలం, ఉప్పెన, అలియా భట్ లకు అభినందనలు తెలిపారు. “ఇది నేను ఎంతగానో గర్వించే క్షణాలు.. నా బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులే అవార్డులను అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ టీం, విజనరీ డైరెక్టర్ రాజమౌళి గారికి కంగ్రాట్స్.
ఆరు అవార్డ్స్ వచ్చాయి. ఎంఎం కీరవాణి గారు.. ప్రేమ్ రక్షిత్, కాళభైరవ, శ్రీనివాస్ మోహన్, కింగ్ సోలోమన్, డీవీవీ ఎంటర్టైన్మెంట్, డీవీవీ దానయ్య గారు. ఇది నాకు ఎంతో మెమోరబుల్ జర్నీ” అంటూ చెప్పుకొచ్చాడు. తాను నటించిన ఆర్ ఆర్ ఆర్ 6 అవార్డ్స్ గెలవడాన్ని హైలెట్ చేశాడు. అల్లు అర్జున్ ఏదో మొక్కుబడిగా థాంక్యూ అని రిప్లై ఇచ్చాడు.
ఈ వరుస పరిణామాలు చూస్తుంటే మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిన మాట వాస్తవమే. ముఖ్యంగా (Ram Charan) రామ్ చరణ్-అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. అది వాళ్ళ సోషల్ మీడియా బిహేవియర్ ద్వారా అర్థం అవుతుందని అంటున్నారు.
గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!
బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!