The Family Star OTT: ఫ్యామిలీ స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఏకంగా అన్ని రోజులు ఆగాలా?

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) , మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ (The Family Star) మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా ఈ సినిమా ఉండగా ఈ సినిమా కథ, కథనంలో కొన్ని మైనస్ లు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోవడం గమనార్హం. మొదట ఈ సినిమా రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఊహించని విధంగా ఈ సినిమా హక్కులు ప్రైమ్ సొంతమయ్యాయి. ఫ్యామిలీ స్టార్ రిలీజైన ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారికంగా క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఫ్యామిలీ స్టార్ మూవీ విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం ఎంతగానో నచ్చింది.


ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. వరుసగా సెలవులు ఉండటంతో కలెక్షన్ల పరంగా ఫ్యామిలీ స్టార్ అదరగొడుతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో మిక్స్డ్ టాక్ వచ్చినా చివరకు హిట్ గా నిలిచిన సినిమాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. రష్మిక ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారని వార్తలు వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.


ఫ్యామిలీ స్టార్ మూవీ కలెక్షన్ల పరంగా అదరగొడుతుందని సులువుగానే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలైంది. శని, ఆదివారాలలో ఈ సినిమాకు పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. విజయ్, మృణాల్ యాక్టింగ్ మాత్రం అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ తుది ఫలితం ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus