The Family Star OTT: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్‌ – మృణాల్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’… ఎక్కడంటే?

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) – మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) – పరశురామ్‌ (Parasuram) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’(The Family Star). ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ సినిమా బాగా కనెక్ట్‌ అయింది అని సినిమా టీమ్‌ చెబుతోంది. ఆ విషయం పక్కన పెడితే… సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ఎక్కడా ముందస్తు సమాచారం, బజ్‌ లేకుండా సినిమాను రిలీజ్‌ చేసేశారు.

నిజానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది అని ఆ మధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. ఏప్రిల్‌ 26న అని కూడా ఆ పుకార్లలో ప్రస్తావించారు. అయితే ఈ విషయంలో టీమ్‌ నుండి కానీ, ఓటీటీ నుండి కానీ ఎలాంటి ఖండన లేదు, సమాచారమూ లేదు. దీంతో సినిమా ఆ రోజు రాదేమో అని అనుకున్నారంతా. అయితే అనూహ్యంగా ఏప్రిల్‌ 26న చూస్తే అంటే ఈ రోజు చూస్తే స్ట్రీమింగ్‌ మొదలైపోయింది. దీంతో ఫ్యాన్స్‌, మీమర్స్‌ తమ పని మొదలుపెట్టేశారు.

అదేంటి మీమర్స్‌ అనుకుంటున్నారా? విజయ్‌ ఏం చేసినా, ఏం మాట్లాడినా వాళ్లు అనడానికి… రిప్లై ఇవ్వడానికి ఫ్యాన్స్‌ ఎప్పుడూ రెడీనే. అలా ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక ఆ విషయం వదిలేస్తే ఈ సినిమా తెలుగుతోపాటు, తమిళంలో కూడా అందుబాటులోకి వచ్చింది. సినిమా థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేయడం గమనార్హం. ఇక సినిమా కథ చూస్తే.. గోవ‌ర్దన్‌ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు.

సివిల్ ఇంజినీర్‌గా ఎక్కువ సంపాదించే అవ‌కాశం ఉన్నా కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ఉంటుంటాడు. అన్నయ్యలు ఇద్దరూ సరైన దిశలో ఉండదరు. చాలీ చాల‌ని జీతంతో నెట్టుకొస్తున్న గోవర్దన్‌ జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఆ తర్వాత ఏమైంది? ‘ఫ్యామిలీ స్టార్‌’ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేదే సినిమా. ఓటీటీలో ఈ కథ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus