Manchu Manoj: మంచు మనోజ్‌ షో ఫస్ట్‌ గెస్ట్‌ అతనేనా? ర్యాంప్‌ ఆడించడం పక్కా!

ఆల్‌రౌండర్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న కథానాయకుడు మంచు మనోజ్‌. కథానాయకుడిగా, యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా.. ఇలా ఏ పని మొదలుపెట్టినా వందకు వంద శాతం ఎఫర్ట్‌ ఇస్తాడు. ఇప్పుడు కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాడు. అదే షో హోస్ట్‌. ఈటీవీలో త్వరలో మనోజ్‌ వ్యాఖ్యాతగా ఓ షో రాబోతోందని సమాచారం. దీనికి ‘ర్యాంప్‌ ఆడిద్దాం’ అనే పేరు పెడుతున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు. కానీ ఓ విషయంలో కాస్త క్లియర్‌ పుకార్లు వినిపిస్తున్నాయి.

అదే ఆ షో తొలి ఎపిసోడ్‌ గెస్ట్‌ గురించి. ఇటీవల ఈ షో తొలి ఎపిసోడ్‌ షూటింగ్ చేశారట. దానికి మాస్‌ మహరాజా రవితేజ గెస్ట్‌గా వచ్చారు అని అంటున్నారు. అంతేకాదు ఈ షో కాన్సెప్ట్‌ అభిమానులతో స్టార్‌ అనేలా ఉంటుంది అని సమాచారం. ఆ లెక్కన మాస్‌ మహరాజాను మాస్‌ ఫ్యాన్స్‌ మధ్య చూడొచ్చు అని అంటున్నారు. అయితే ‘అన్‌స్టాపబుల్‌’ షోకి దగ్గరగా ఉండకుండా ప్రయత్నాలు చేస్తున్నారట.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ షో రూపొందుతోంది. గతంలో వీరు చేసిన ‘అలా మొదలైంది’కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ షోతో కూడా అదే స్థాయి, కుదిరితే అంతకుమించిన ఫలితం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే షో టైమింగ్స్ అనౌన్స్‌ చేస్తారు అని టాక్‌. ప్రస్తుత సమాచారం ప్రకారం అయితే ఈ షో ప్రతి మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారమవుతుంది.

మరోవైపు రవితేజ, మంచు మనోజ్‌ (Manchu Manoj) ఓ సినిమాలో నటిస్తారు అనే టాక్‌ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించింది. సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని అన్నారు. మరి ఆ సినిమా గురించి ఏమైనా సమాచారం ఈ ఎపిసోడ్‌లో వస్తుందేమో చూడాలి. ఒకవేళ ఆ సినిమా ఈ షో వేదికగా అనౌన్స్‌ చేస్తే ఇటు రాకింగ్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కి, అటు మాస్‌ మహరాజా ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ అని చెప్పాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus