రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఫస్ట్ లుక్ ఈ నవంబర్లో వస్తుందని టీం ముందుగానే ప్రకటించారు. అందులో భాగంగా ఆల్రెడీ విలన్ కుంభ పాత్ర చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ను రివీల్ చేయడం జరిగింది. ఇక మహేష్ బాబు లుక్ ను అలాగే టైటిల్ గ్లింప్స్ ను ఈ నవంబర్ 15న లాంచ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు.
ఇంతలో సడన్ గా ఈ సినిమాకు సంబంధించి ‘గ్లొబ్ ట్రోట్టర్ – టాపిక్’ అంటూ ఓ పాటని విడుదల చేశారు రాజమౌళి అండ్ టీం. 3 నిమిషాల 35 సెకన్ల నిడివి కలిగి ఉంది ఈ ‘గ్లొబ్ ట్రోట్టర్- టాపిక్’ పాట. ‘కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగేలే. వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేనే. కాండాలే దాటేస్తూ ఖగరాజై వాలే. రారా రారా వీరా ధృవతార’ అంటూ సాగింది ఈ పాట. సినిమా థీమ్ ను తెలియజేస్తూ ఈ పాట లిరిక్స్ ఉన్నాయి.
ఇంకోరకంగా ఈ జోనర్ కి ఆడియన్స్ ని ప్రిపేర్ చేయాలి అనే ఉద్దేశంతో దర్శకుడు రాజమౌళి ఈ పాటని వదిలినట్టు అనుకోవచ్చు. ఇక ఈ లిరిక్స్ తర్వాత వచ్చే మ్యూజిక్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ‘సంచారి సంచారి’ అంటూ వచ్చే హుక్ లైన్ వైరల్ అవ్వడం ఖాయం. కీరవాణి సంగీతంలో రూపొందిన ఈ సాంగ్ కి చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఆలపించడం జరిగింది. కచ్చితంగా అందరినీ ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్లే విధంగా ఉంది అని చెప్పాలి. మీరు కూడా ఒకసారి వినండి :