పొలిమేర మూవీ లో హీరోయిన్ గా నటించి తన షార్ప్ లుక్స్ మరియు నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ కామాక్షి భాస్కర్ల. అసలు అయితే కామాక్షి యాక్టర్ కంటే ముందు తాను ఒక డాక్టర్. చైనా లో తాను ఎం.బి.బి.ఎస్ కంప్లీట్ చేసింది. ఆ తరువాత యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ తో షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సిరీస్ లు చేస్తూ పొలిమేర మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
Kamakshi Bhaskarla
తాను ఒక డాక్టర్ , యాక్టర్ మాత్రమే కాక డైలాగ్ రైటింగ్ & సింగింగ్ కూడా చేస్తుంది అంట. ఈ విషయాన్ని అల్లరి నరేష్ హీరోగా, కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న12A రైల్వే కాలనీ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ సినిమాలో డైలాగ్స్ కూడా రాసింది అని , సినిమా టైటిల్స్ లో అడిషనల్ డైలాగ్స్ అని తన పేరు కూడా పడుతుంది అని చెప్పాడు. అంతేకాక తాను సాంగ్స్ కూడా పాడుతుంది అంట. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తనతో ఒక సాంగ్ కూడా ప్లాన్ చేసాడని సమాచారం. ఈ మూవీ ఈ నెల 21న (నవంబర్ 21) రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
ఇన్ని టాలెంట్స్ ఉన్నా కూడా కామాక్షి కి తన టాలెంట్ కి తగ్గ సినిమా ఇప్పటి వరకు దక్కించుకోలేకపోయింది అనేది మాత్రం వాస్తవం. సినీ ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్స్ కి ఫస్ట్ మూవీస్ పెద్ద హిట్ కాకపోయినా వరుస ఆఫర్లు వాళ్ళ తలుపు తడుతుంటాయి. వాళ్లలో మొదటి వరుసలో ఉంది శ్రీలీల , తన మొదటి మూవీ పెళ్లి సందడి పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది ఈ భామ.