శరవణ స్టోర్స్ యజమాని శరవణన్ అరుల్ అనగానే అందరికీ ఈయన టక్కన గుర్తుకు వస్తారు. ఈయన స్టోర్స్ కి సంబంధించిన ప్రకటనలలో ఈయనే నటిస్తూ సందడి చేస్తుంటారు. నటనపై ఆసక్తితో ఈయన తన స్టోర్స్ ప్రమోషన్ కోసం నటీనటులను ఉపయోగించుకోకుండా తానే తన స్టోర్స్ ను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా నటనపై ఆసక్తి ఉండడంతో ఈయన ఏకంగా సినిమా చేయాలని కూడా భావించారు. ఈ క్రమంలోనే సొంత నిర్మాణంలో కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ది లెజెండ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా ఈ సినిమా పెద్దగా సందడి చేయలేక పోయినప్పటికీ హీరోగా సినిమా చేయాలని ఆయన కోరిక మాత్రం నెరవేరింది. అయితే శరవణన్ నటనపై ఉన్న ఆసక్తి ఆయనని ఒక్క సినిమాతోనే ఆగిపోయేలా చేయలేదు. ఈ క్రమంలోనే మరో సినిమా చేయడానికి కూడా ఈయన సిద్దమయ్యారనీ తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఇలా శరవణన్ తదుపరి సినిమా షూటింగ్ పనులు ఇప్పటికే కాశ్మీర్లో కొంతమేర పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోని ఈయన కాశ్మీర్లో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అధికారకంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.1970 చెన్నైలో జన్మించిన ఆయన చదువు పూర్తి చేశాక.. తండ్రిబాటలోని వ్యాపారాలు చూసుకుంటూ వచ్చారు.
అయితే నటనపై ఆసక్తి ఉండడంతో మొదట్లో మోడల్ గా చేసినటువంటి ఈయన అనంతరం తన స్టోర్స్ ప్రమోట్ చేస్తూ తానే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. అనంతరం హీరోగా 50 సంవత్సరాల వయసులో ఈయన వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?