Jr NTR: గుంటూరు కారం సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న సంబంధం ఇదే!

సాధారణంగా దర్శకులు కొన్ని సినిమా కథలు సిద్ధమైన తర్వాత హీరోలను ఎంపిక చేస్తే మరికొన్ని సినిమా కథలను మాత్రం హీరోల బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా తీస్తారు. ఒక హీరో బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే కథ మరో హీరోకు సూట్ కాదు. గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. త్రివిక్రమ్ కు అత్యంత సన్నిహితులైన వాళ్లు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మహేష్ అసహనం వ్యక్తం చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు వెకేషన్ లో ఉండగా మహేష్ పాత్ర చైల్డ్ హుడ్ ఎపిసోడ్లను ఇప్పుడు షూట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ కావడం వల్లే గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఈ సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.

ఎన్టీఆర్ (Jr NTR) కోసం త్రివిక్రమ్ ఊరమాస్ సన్నివేశాలను సిద్ధం చేయగా అదే కథతో మహేష్ తో సినిమా తీస్తుండటంతో కొన్ని సీన్ల విషయంలో మహేష్ త్రివిక్రమ్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని సమాచారం అందుతోంది. మహేష్ కు అనుగుణంగా త్రివిక్రమ్ ముందుగానే స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గుంటూరు కారం సినిమాకు భారీ స్థాయిలోనే బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది. గుంటూరు కారం సినిమాలో షాకింగ్ ట్విస్ట్ లు ఉండనున్నాయని ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్ లు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. మీనాక్షి చౌదరి, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus