Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నంది గొడవలను బ్యాగ్రౌండ్ లో డైరెక్ట్ చేస్తున్నారా!

నంది గొడవలను బ్యాగ్రౌండ్ లో డైరెక్ట్ చేస్తున్నారా!

  • November 18, 2017 / 07:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నంది గొడవలను బ్యాగ్రౌండ్ లో డైరెక్ట్ చేస్తున్నారా!

నిజమే మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఎవరిపైనయినా యథేచ్ఛగా విమర్శలు చేయవచ్చు. తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవచ్చు. తమ నిరసనను నిరభ్యంతరంగా వ్యక్తీకరించవచ్చు. అయితే.. ఆ నిరసనలు, విమర్శలు ఎదుటివారి మనోభావాలను పొరపాటున కూడా గాయపరచకూడదు. నీ చేయిని నీ ఇష్టం వచ్చినట్లు సాచవచ్చు.. లేదా గాల్లో తిప్పుకోవచ్చు. కానీ అది ఎదుటివారి ముక్కుకు తగలనంతవరకు మాత్రమేనన్న విషయాన్నిఎప్పుడూ స్పృహలో ఉంచుకోవాలి. కానీ ఇప్పుడు మన చిత్ర పరిశ్రమలో కొందరు వ్యక్తులు ‘ఆ స్పృహ’ లేకుండా విమర్శలు చేస్తున్నారేమోననిపిస్తోంది. అవును.. నంది అవార్డుల ఎంపికపై వెలువడుతున్న విమర్శలపై ఇప్పుడు ఇటువంటి విమర్శలే వెలువడుతున్నాయి. నంది అవార్డుల ఎంపికను తప్పు పడుతూ చేస్తున్న వ్యాఖ్యలు మరీ శృతిమించుతున్నాయని చెప్పక తప్పదు.

నంది అవార్డుల ఎంపిక తీరును తప్పు పడుతూ ఒక ప్రముఖ దర్శకుడు నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు స్వయంగా దగ్గరుండి.. మిగతా పనులన్నీ మానుకొని అవార్డుల ఎంపికను పర్యవేక్షించినట్లుగా ఆయన చంద్రబాబును ఉద్దేశించి ఆ లేఖ రాశారు. మరో యువ నిర్మాత.. మరి కొంచెం ముందుకెళ్లి.. నంది అవార్డులు గెలుచుకోవాలంటే.. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నటనలో మెళకువలు నేర్చుకోవాలేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. చెక్ బౌన్స్ సహా పలు పోలీసు కేసులు ఎదుర్కొంటున్న మరొక ఆల్ రౌండర్ నంది అవార్డుల్ని సైకిల్ అవార్డులుగా ప్రకటించి పారేశాడు.

ప్రభుత్వంచే నియమితమైన జ్యూరీ ఎంపిక చేసిన అవార్డుల్లో లోపాలు ఎత్తి చూపడం ఎంతమాత్రం తప్పుకాదు. కానీ అందుకు ఏకంగా ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయడం, సాక్షాత్తూ ప్రభుత్వాధినేతకు పక్షపాతాన్ని అంటగట్టాలని చూడడం మాత్రం సమర్ధనీయం కాదు. తమకు, తమ సినిమాలకు అవార్డులు రాకపోవడంపై అసంతృప్తి చెందడం వరకు ఓకే. కానీ.. అవార్డులు గెలుచుకున్న సినిమాలను చులకన చేసి మాట్లాడడం కచ్చితంగా క్షంతవ్యం కాదు. అవార్డులు గెలుచుకున్నవారు ఆనంద పడకుండా.. వారు గిల్టీగా ఫిలయ్యేలా చేయడం సంస్కారం కూడా కాదు. ఇటువంటి వాచాలత్వం కలిగినవారిపై కన్నెర్ర జేయాల్సిన అవసరం, కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. ఇలాంటివాళ్ళను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మరింతమంది మరిన్ని నేలబారు విమర్శలు చేసే ప్రమాదముంది. ఏ అవార్డు అయితే రాలేదని వాపోతున్నామో.. ఆ అవార్డు ఔన్నత్యం దెబ్బతినేలా వ్యవహరించడం మంచిది కాదు.

అయితే.. ఈ గొడవలన్నీ ఇండస్ట్రీలో “ఆ నలుగురు” అని చెప్పుకొనే పెద్దల్లో ఒకరి డైరెక్షన్ లోనే జరుగుతున్నాయని స్ట్రాంగ్ టాక్. మరి ఆ పెద్దాయనకి ఈ గొడవల కారణంగా ఏం ఉపయోగం ఉందో తెలియదు కానీ.. ఆయన మాత్రం తన అనుచరులను గట్టిగా వాడుకొని రచ్చ చేయిస్తూ ఈ గొడవల్ని ఎంజాయ్ చేస్తున్నాడాయన.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #nandi awards
  • #NBK
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

11 hours ago
Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

1 day ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

2 days ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ.. తెలుగమ్మాయిలు సాధిస్తారా?

10 hours ago
RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

12 hours ago
Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

13 hours ago
Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

14 hours ago
Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version