పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది” సినిమా కూడా రిలీజ్ కి వారం ముందు మాత్రమే లీక్ అయ్యింది. కానీ.. ఎవరికీ పెద్దగా అంచనాలు కానీ.. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ కానీ లేని విజయ్ దేవరకొండ “ట్యాక్సీవాలా” చిత్రాన్ని లీక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరికుంది?. ఈ “ట్యాక్సీవాలా” ఫస్ట్ కాపీతోపాటు “గీత గోవిందం” సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ కూడా లీక్ అయ్యాయి. దాంతో అందరూ.. ఇదంతా ఎవరో విజయ్ దేవరకొండ మార్కెట్ ను డౌన్ చేయడం కోసం కావాలనే చేస్తున్నారని అనుకొన్నారు. విజయ్ అయితే.. నిన్న జరిగిన “గీత గోవిందం” ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏడ్చినంత పని చేశాడు.
అయితే.. ఈ లీకేజీ వెనుక విజయ్ దేవరకొండ మార్కెట్ ను డౌన్ చేయడం, సినిమా మీదున్న అంచనాల్ని తలకిందులు చేయడం కంటే పెద్ద మరియు భారీ రీజన్ ఒకటి ఉంది. అదే బద్ధకం. అదేంటి.. బద్ధకానికి, పైరసీకి సంబంధం ఏమిటి అనుకొంటున్నారా?. విషయం ఏంటంటే.. “ట్యాక్సీవాలా” ఫస్ట్ కాపీ సిద్ధమయ్యాక ప్రొడ్యూసర్స్ అవుట్ పుట్ తో హ్యాపీగా లేకపోవడంతో దాదాపు నాలుగురైదుగురు దర్శకులు ఈ ఎడిటింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారు. దాంతో.. ఆటోమేటిక్ గా ఒక ఆరేడుగురు ఎడిటర్స్ చేతులు కూడా ఈ హార్డ్ డిస్క్ మీద పడ్డాయి. ఆ సమయంలో ఎవరో ఒకరు సరదాకి తమ స్వంత హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న “ట్యాక్సీవాలా” సినిమా ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు ఇలా అజాగ్రత్తగా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం.