ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ కలెక్షన్ల విషయంలో సత్తా చాటుతోంది. కొన్ని ఏరియాలలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఇప్పటికే క్రియేట్ అయిన ఎన్నో రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. ఒక సందర్భంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ సలార్ అంటే అర్థం ఏంటో తెలియజేశారు. సలార్ అనేది ఒక ఉర్దూ పదం అని ఆయన చెప్పుకొచ్చారు. సలార్ అనే పదానికి సమర్థవంతమైన నాయకుడు అనే అర్థం వస్తుందని ప్రశాంత్ నీల్ తెలిపారు.
రాజుకు కుడిభుజంగా ఉంటూ అత్యంత నమ్మదగిన వ్యక్తిని సలార్ అని పిలుస్తారని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు. కథకు అనుగుణంగానే సలార్ టైటిల్ ఫిక్స్ కాగా సలార్2 మూవీ సలార్ శౌర్యాంగ పర్వం అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. సలార్1 లో దేవా, వరద మధ్య స్నేహాన్ని చూపించిన ప్రశాంత్ నీల్ సలార్2 సినిమాలో దేవా, వరద పాత్రల మధ్య శత్రుత్వాన్ని ఎలా చూపిస్తారో చూడాలి.
సలార్ మూవీ సక్సెస్ సాధించడంతో ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటుల గురించి కూడా చర్చ జరుగుతోంది. శ్రియారెడ్డి, జాన్ విజయ్, జగపతిబాబు కెరీర్ లకు ఈ సినిమా వల్ల ఎంతో బెనిఫిట్ కలుగుతుంది. ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉండేలా సలార్ ను ప్రశాంత్ నీల్ తెరకెక్కించడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగించింది.సలార్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇతర సినిమాలకు కలెక్షన్లు తగ్గిపోయాయి.
ప్రభాస్ కు సూట్ అయ్యే కథతో సినిమా తీస్తే ఏ రేంజ్ లో హిట్ అవుతుందో సలార్ ప్రూవ్ చేసింది. 2023 సంక్రాంతికి విడుదలైన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి బాక్సాఫీస్ కు జోష్ ఇవ్వగా 2023 క్రిస్మస్ కు సలార్ జోష్ ఇచ్చింది. ప్రభాస్ తర్వాత సినిమాలు సైతం ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాయేమో చూడాలి.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!