విలక్షణ నట ప్రపూర్ణ “ప్రకాష్ రాజ్”!!!

సినీ పరిశ్రమలో అన్ని పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోయే నటులు చాలా అరుదుగా ఉంటారు. ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్ర తనకోసమే పుట్టిందేమో అన్నంతగా నటన కనబరిచే అతి కొద్ది మంది నటులలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేకం. తండ్రిగా, హార్డ్ కోర్ విలన్ గా, కామెడీ విలన్ గా, ప్రత్యేక పాత్రల్లో తన నటన అద్భుతం…అజరామరం… అంటే అతిశయోక్తి కాదు. స్వతహాగా కన్నడ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రాజ్ అన్ని భాషల్లోనూ తనదైన శైలిలో నటించి మెప్పిస్తున్నాడు. అంతేకాకుండా తన ప్రతిభకు పట్టం కట్టే విధంగా దాదాపు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, 5 న్యాషనల్ అవార్డ్స్, ఒక్క తెలుగులోనే దాదాపుగా 6 నంది అవార్డ్స్ ను సొంతం చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే…తాను అవార్డ్స్ కు అలకారం కానీ, అవార్డ్స్ తనకు ఆలంకారం కాదు అని చెప్పొచ్చు. అదే క్రమంలో తనకు నచ్చిన కధను ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించి నిర్మాతగానూ దాదాపు పద్దెనిమిది సినిమాలు నిర్మించడమే కాకుండా, అయిదు సినిమాలను తానే స్వయంగా డైరెక్ట్ చేశాడు.
ఇక అంతటి విలక్షణమైన పాత్రలు నటిస్తూ మెప్పిస్తున్న ప్రకాష్ రాజ్ సినీ కరియర్ లో కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి.

వీడు సామాన్యుడు కాదు

ఈ సినిమాలో ప్రియురాలిపై పగ తీర్చుకునే పాత్రలో ప్రకాష్ రాజ్ నటన అద్భుతం.

అతడు

త్రివిక్రమ్ సంధించిన పదునైన ఆయుధం ఈ చిత్రం. ఇక ఈ చిత్రంలో సీబీఐ ఆఫీసర్ గా కేస్ ను డీల్ చేసే విధానంలో ప్రకాష్ రాజ్ ప్రేక్షకులను తన నటనతో కట్టి పడేశాడు.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి

ఈ సినిమాలో హీరో తండ్రిగా, ఒక లక్ష్యం కోసం కుటుంబానికి దూరం అయిన భర్తగా అతని నటన ప్రేక్షకుల చేత సెభాశ్ అనెలా చేసింది.

నువ్వే నువ్వే

కోటీశ్వరుడి పాత్రలో, తనకన్నా తన కూతురుని ఎవ్వరూ ఎక్కువగా ప్రేమించలేరు, ప్రేమించకూడదు అన్న ఫొర్ములా లో బ్రతికే తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు అనడం కన్నా, జీవించాడు అంటే కరెక్ట్.

ఒక్కడు

రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ గా, సినిమాలో మెయిన్ విలన్ గా, సీమ బాషలో హీరోనూ ఎదుర్కునే సన్నివేశాల్లో అతని నటన అద్భుతం.

మహారాణి

ముంబై రెడ్ లైట్ ఏరియా లో స్వలింగ సంపర్కం ఉన్న వ్యక్తి పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించాడు.

అపరిచితుడు

సీబీఐ ఆఫీసర్ గా, రకరకాల వేషాల్లో అతను హంతకుణ్ణి పట్టుకునే సీన్స్ లో అతని నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

ఇద్దరు

రచయిత నుంచి రాజకీయ నాయకుడిగా మారిన పాత్రలో ప్రకాష్ రాజ్ నటన అద్భుతం.

చక్రం

కోటీశ్వరుడి పాత్రలో కన్న కొడుకు చనిపోతున్నా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ప్రకాష్ రాజ్ పాత్ర, ఆయన చూపించిన వేరీయేషన్స్ నిజంగా ఆయన్ని విలక్షణ నటనకు నిదర్శనం అనే చెప్పాలి.

ధోని

అనుకోని పరిస్థితుల్లో వికలాంగుడుగా మారిన కొడుకు కోసం, ప్రస్తుత చదువులపై ప్రకాష్ రాజ్ నటించి, తెరకెక్కించిన ఈ చిత్రంలో అతని దర్సకత్వమె కాదు, నటన కూడా అద్భుతం.

ఖడ్గం

కుల,ఘర్షణల నేపధ్యంలో దేశంపై ప్రేమను చూపిస్తూనే, మతం అన్న పదానికి విలువను తెలియజీసే పాత్రలో ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటన కనబరిచాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

అమాయకపు గోదావరి జిల్లా వాడిగా, సహజమైన నటన కనబరిచాడు.

పోకిరి

‘ఆలీ భాయ్’ పాత్రలో రోరింగ్ విలన్ గా విలక్షణమైన నటనతో ఆ పాత్రను ఉతికి ఆరేసాడు.

బొమ్మరిల్లు

తన పిల్లలకు థి బెస్ట్ ఇవ్వాలి అన్న ఆలోచన ఉన్న తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ చంపేసాడు

ఠాగూర్

ఈ సినిమాలో సామాన్య కానిష్టేబిల్ పాత్రలో కేస్ ను చేదించే పాత్రలో అతనై నటన అద్భుతంగా ఉంది.

అంతఃపురం

పగ తీర్చునే ఫ్యాక్‌షన్ లీడర్ గా అద్భుతంగా నటించాడు.

సుస్వాగతం

హీరోయిన్ తండ్రిగా, మోనార్క్ పాత్రలో నటించి మెప్పించాడు.

బద్రి

పవర్ స్టార్ ను  ఢీ కొట్టే పాత్రలో హీరోయిన్ అన్నగా మంచి నటన కనబరిచాడు.

 

 

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus