తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడిగా తెలుగువారి అల్లూరి సీతారామరాజుగా ఒక జేమ్స్ బాండ్ గా ఒక కౌబాయ్ గా పేరు సంపాదించుకున్నారు సీనియర్ నటుడు కృష్ణ. ఈయన ఎన్నో అద్భుతమైన తెలుగు సినిమాలలో నటించి విశేషమైన ఆదరణ పొందారు. ఇకపోతే కృష్ణ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక బుర్రపాలెంలో జన్మించిన కృష్ణ ఒక సాధారణమైన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
ఈయన తండ్రి కలప వ్యాపారం చేస్తూ ఉండేవారు.బాల్యం అంతా బుర్రె పాలెం లోనే చదివినప్పటికీ ఈయన డిగ్రీ మాత్రం ఏలూరులోని సి ఆర్ రెడ్డి కళాశాలలో పూర్తి చేశారు. అయితే ఈయన డిగ్రీ చదువుతున్న సమయంలో ఈ కాలేజీకి ఒక రోజు కార్యక్రమం నిమిత్తం అక్కినేని నాగేశ్వరరావు హాజరయ్యారు. నాగేశ్వరరావు అప్పటికే 60 సినిమాలను పూర్తి చేసి హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ విధంగా అప్పట్లో నాగేశ్వరరావు గారికి ఎంతో మంచి క్రేజ్ ఉండేది
ఇలా వారి కాలేజీకి రావడంతో ఆయనకు ఉన్నటువంటి అభిమానులను చూసినటువంటి కృష్ణ ఎలాగైనా తాను కూడా హీరోగా కొనసాగాలని ఇలాంటి అభిమానాన్ని సొంతం చేసుకోవాలని భావించారు. అదే సమయంలోనే తన తండ్రితో ఈ విషయం చెప్పి ఆయన మద్రాసు వచ్చారు. మద్రాస్ కు వచ్చినటువంటి కృష్ణ ఎల్ వి ప్రసాద్, చక్రపాణి ఎన్టీఆర్ వంటి వారిని కలిశారు. ఈ విధంగా వీరితో ఏర్పడిన పరిచయం అనంతరం సినిమాలలోకి ఇంకా సరైన వయసు రాలేదు కనుక తనని నాటకాలు వేసి అనుభవం తెచ్చుకోవాలని సూచించారు.
ఈ క్రమంలోనే కృష్ణ మొదటిసారి శోభన్ బాబుతో కలిసి చేసిన పాపం కాశి అంటూ ఒక నాటకాన్ని చేశారు. అనంతరం జగ్గయ్య చేసిన ముందుకు వెళ్దాం పదండి అని సినిమాలో చిన్న పాత్రలో నటించారు.ఇలా రెండు మూడు సినిమాలలో చిన్న పాత్రలలో నటించిన కృష్ణ అనంతరం తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఈ విధంగా నాగేశ్వరరావు క్రేజ్ చూసి కృష్ణ కూడా ఇండస్ట్రీలోకి రావాలని సంకల్పంచుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!