కన్నడ చిత్ర పరిశ్రమలో రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగు తమిళ హిందీ భాషలలో కూడా ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. భూతకోల నృత్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 400 కోట్ల కలెక్షన్లను రాబట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు.
ఇక ఈ సినిమా ద్వారా నటుడు రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇకపోతే తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఏకంగా కాంతార సినిమా ప్రశ్నను ఏకంగా పరీక్ష పత్రంలో అడగడంతో ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది. కర్ణాటక ప్రభుత్వంలో జరిగిన మిల్క్ ఫెడరేషన్ పరీక్షలలో కాంతార సినిమా గురించి ప్రశ్నలు వేశారు.
ఇందుకు సంబంధించిన పరీక్ష పత్రాన్ని నటి సప్తమి గౌడ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ సందర్భంగా పరీక్ష పత్రంలో తాజాగా విడుదలైన కాంతార సినిమా దేని ఆధారంగా తెరకెక్కినది అంటూ నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. జల్లికట్టు, భూత కోల, యక్షగాన, దమ్మామి అంటూ నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. ఇలా పరీక్ష పత్రంలో కాంతర సినిమా గురించి ప్రశ్నలు అడగడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.