The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో ‘ది రాజాసాబ్’ రూపొందుతుంది. ఇదొక హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వారికి చాలా కీలకం. ఎందుకంటే ‘ధమాకా’ తర్వాత ‘పీపుల్ మీడియా..’ వారు నిర్మించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

The Raja Saab

దీంతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది పీపుల్ మీడియా సంస్థ. ఆ నష్టాలను రాజాసాబ్ తో తీరుస్తాము అని ధీమా వ్యక్తం చేసిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందుకే ‘ది రాజాసాబ్’ రిలీజ్ విషయంలో వాళ్ళు అస్సలు కంగారు పడటం లేదు. ఏప్రిల్ లోనే సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. వి.ఎఫ్.ఎక్స్ బాలేదని చెప్పి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు.

డిసెంబర్ 5న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు కూడా. ఇప్పుడు ఆ డేట్ కి కూడా ‘రాజాసాబ్’ రాకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. అవును ‘ది రాజాసాబ్’ మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ది రాజాసాబ్’ ను 2026 జనవరి 9న రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ఆసక్తి చూపుతుందట.

ఈ సినిమాలో ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాదు మాస్ అభిమానులకి నచ్చే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ‘ది రాజాసాబ్’ ని సంక్రాంతికి తీసుకురావడం కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus