రేవ్‌ పార్టీ పుకార్లపై దర్శకుడి వరుస ట్వీట్లు… ఏం చెప్పారంటే?

నగరంలోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై పోలీసుల దాడి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు అంటూ ఆదివారం ఉదయం నుండి వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 148 మంది నుండి వివరాలు సేకరించి పంపించేశాం అని పోలీసు చెప్పారు. నిఘా అయితే కొనసాగుతుందని చెప్పారు. పోలీసులు ఇచ్చిన జాబితాలో కొణిదెల నిహారిక పేరు లేదు. కానీ ఆమెను అదుపులోకి తీసుకున్నారని, పోలీసు స్టేషన్‌ నుండి ఆమె వెళ్తున్న ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. యూట్యూబ్‌లో కూడా దానికి సంబంధించిన థంబ్‌ నెయిల్స్‌ వస్తున్నాయి.

Click Here To Watch NOW

అయితే అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని యువ దర్శకుడు సాయి రాజేశ్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు. జరిగింది ఇదీ అంటూ వివరించారు. ఈ రోజు ఉదయం వరకు పబ్‌ సంఘటనపై స్నేహితులతో చెప్పుకొని నవ్వుకున్నాం. అయితే నిద్ర లేచి చూసేసరికి సోషల్‌ మీడియాలో వార్తలు చూసి బాధేస్తోంది. పార్టీలో నేను నిహారికను కలిశాను. ఆమె నాకు గుడ్‌ లక్‌ కూడా చెప్పారు. ఆ తర్వాత కాసేపటికి పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను.

నిజానికి ఆ పబ్‌కి ఉదయం మూడు వరకు నిర్వహించుకునే అనుమతి ఉంది. వెస్టిన్‌, ఆర్టిస్ట్రీ, ఓటీమ్‌ల తరహాలోనే ఈ అనుమతి ఉంది. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఆ పబ్‌ ఉండటమే దానికి కారణం అని సాయి రాజేశ్‌ ట్వీట్‌ చేశారు. రాత్రి పబ్‌లో 300 మందికిపైగా ఉన్నారు. అందులో ఎక్కువమంది ఉత్తర భారతదేశానికి చెందినవారే. పార్టీ జరుగుతున్న సమయంలో సుమారు 50 మంది పోలీసులు వచ్చారు. లోపల ఉన్నవారందరినీ వెళ్లిపోమని చెప్పారు.

అప్పుడే నేను కిందకు వచ్చాను. బయట చూస్తే మరో 50 మంది పోలీసులు ఉన్నారు. పబ్‌ లోపల ఉన్నవారందరినీ బంజారా హిల్స్‌ రమ్మని చెప్పారు. దీంతో అందరం అక్కడికి వెళ్లాం. ఎలాంటి చెకింగ్‌ చేయలేదు. అయితే అక్కడికి చేరుకున్న వారిలో ఉన్న యూఎస్‌ సిటిజన్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. అయితే 30 నిమిషాల్లో విడిచి పెట్టేస్తారని తెలిసింది అని ట్వీట్‌లో రాసుకొచ్చారు సాయి రాజేశ్‌. అయితే ముందుగా అనుకున్న, తెలిసిన 30 నిమిషాలు కాస్త మూడు గంటలు అయ్యింది. అప్పుడు అక్కడ ఓ వాట్సాప్‌ నెంబరు కాగితంలో రాసి అతికించారు.

అందరి ఆధార్‌ కార్డు ఫొటోలు పంపమని పోలీసులు అడిగారు. దాంతో అందరం ఆధార్‌ కార్డులు పంపించి అక్కడి నుండి వెళ్లిపోయాం. ఉగాది రోజు అనవసరంగా ఇలా అయిపోయింది. ఇంట్లో ఉన్నా బాగుండేది కదా అనుకుంటూ ఇంటికి వచ్చేశాం. నిద్రపోయి లేచి చూసేసరికి పరిస్థితి ఇలా మారిపోయింది. (షేర్‌ చేసిన స్క్రీన్‌ షాట్‌లో నిహారిక పోలీసు స్టేషన్‌ దగ్గర ఉన్న వీడియో థంబ్స్‌ ఉన్నాయి. ) పబ్‌ దగ్గర ఎవరినీ అరెస్టు చేయలేదు. కానీ రేవ్‌ పార్టీ అని థంబ్‌ నెయిల్స్‌ రాసేస్తున్నారు.

నిహారిక గురించి కూడా థంబ్స్‌ పెట్టేస్తున్నారు. రాత్రి ఇదంతా జరిగినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది. అక్కడ ఆమె కనీసం తాగను కూడా తాగలేదు. అయితే నేను చిరంజీవి అభిమానిని కాబట్టి నన్ను ఎవరైనా ఈ విషయంలో ట్రోల్‌ చేయొచ్చు. అయితే ఆ 300 మందిలో చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్లే. వాళ్ల కోసం, వాళ్ల శ్రేయస్సు కోరే వారి కోసమే ఇదంతా చెబుతున్నాను. అక్కడ ఎవరినీ అరెస్టు చేయలేదు, సంతకం కూడా తీసుకోలేదు. అందరినీ పంపించేశారు అంటూ ట్వీట్స్‌ ముగించారు సాయి రాజేశ్‌.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus