Bheemla Nayak, RRR: ‘ఆర్.ఆర్.ఆర్’ పక్కన ‘భీమ్లా’ వస్తే అదొక అడ్వాంటేజ్ అట..!

ఎన్నడూ లేని విధంగా 2022 సంక్రాంతికి ఏకంగా 4 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు ప్రకటించారు. అవే ‘ఆర్.ఆర్.ఆర్’, ‘భీమ్లా నాయక్’ ‘సర్కారు వారి పాట’ ‘రాధే శ్యామ్’. వీటిలో ‘సర్కారు వారి పాట’ టీం రాజీపడి ఏప్రిల్ 1కి వెళ్లారు. కానీ మధ్యంలో ‘బంగార్రాజు’ వచ్చి చేరాడు. అది పెద్ద సమస్య కాదు. ‘బంగార్రాజు’ కి గట్టిగా 370 థియేటర్లు వచ్చినా చాలనుకుంటున్నారు. పైగా ఆ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలైన వారం రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది.

ఎటొచ్చి టఫ్ ఫైట్.. ‘ఆర్.ఆర్.ఆర్’, ‘భీమ్లా నాయక్’, ‘రాధే శ్యామ్’ ల మధ్యే ఉంటుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ ను అటుంచితే.. ‘భీమ్లా నాయక్’ ‘రాధే శ్యామ్’ టీంలు వెనక్కి తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా ‘భీమ్లా నాయక్’ వేరే టైంలో సోలో రిలీజ్ చేసుకున్నా బాగా క్యాష్ చేసుకోవచ్చు. అయినా నిర్మాతలు నొ అంటున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. అసలే ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై పగపట్టేసింది. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ పై కూడా ఫోకస్ పెట్టినట్టు టాక్.

ఈ సినిమాలో రానా కూడా ఉన్నాడు కదా..! ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి ఎన్టీఆర్ తరుపున కొడాలి నాని(మంత్రి) ఫేవర్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి.. ‘ఆర్.ఆర్.ఆర్’ పక్కన వచ్చేస్తే ‘భీమ్లా’ కి అడ్డు ఉండదు అనేది నిర్మాతల ప్లాన్ గా తెలుస్తుంది. మరి ‘రాధే శ్యామ్’ సంగతేంటి? వాళ్ళు వెనక్కి తగ్గుతారా అంటే.. కచ్చితంగా చెప్పలేము. చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus