అన్నీ కుదిరి ఆ రోజుల్లో సినిమా వచ్చుంటేనే… కథ వేరుండేది

  • December 21, 2020 / 02:12 PM IST

నిన్న బిగ్‌బాస్‌ ఫైనల్‌లో చిరంజీవి – నాగార్జునను చూస్తే రెండు కళ్లూ సరిపోలేదు కదా. ఆ రేంజ్‌ కటౌట్లు మరి. ఆ స్టార్‌కి మరో స్టార్‌ వెంకటేశ్‌ కలిస్తే ఆ ఫ్రేమ్‌ ఇంకా సూపర్‌. బుల్లితెర మీదే వీరి కలయిక బాగుంటుంది అనుకుంటే… మరి 70 ఎంఎం తెర మీద చూస్తే ఇంకా అదిరిపోద్ది. అదేంటి ఈ మెమొరబుల్‌ కాంబినేషన్‌ లో సినిమా ఏమైనా సిద్ధమవుతోందా? అంటారా. ఇప్పుడు అవడం లేదు. అన్నీ కుదిరుంటే సినిమా వచ్చి 25 ఏళ్లు దాటిపోయేది. అవును 90వ దశకంలోనే ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఓ సినిమా అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా ఓకే కాలేదు. తర్వాత వేరే వాళ్లు చేశారులెండి.

మల్టీస్టారర్‌ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా ఆ సినిమా న్యూస్‌పైనే. అభిమానుల అంచనాలైతే ఆకాశాన్నే అంటుతాయి. అయితే అలాంటి సినిమాలు పట్టాలెక్కించడం, జనాల్ని మెప్పించడం, కలెక్షన్లు తెప్పించడం అంత సులభం కాదు. కథానాయకుల ఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకొని కథ, కథనాలు సిద్ధం చేయడం, దాన్ని మెటీరియలైజ్‌ చేయడం ఏమంత చిన్న విషయాలు కావు. అందుకే పెద్ద హీరోలతో మల్టీస్టారర్‌లు ఎక్కువగా కలగానే మిగిలిపోతుంటాయి. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణల టైమ్‌లో మల్టీస్టారర్‌లు చూడగలిగాం. అదే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున హయాంలో సరైన మల్టీస్టారర్‌ చూడలేకపోయాం. మళ్లీ ఇప్పటి తరం అలాంటి ప్రయత్నాలు చేస్తోంది. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’,‘గోపాల గోపాల’, ‘బాహబలి’ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటివి ఆ కోవకు వచ్చేవే.

ఇక చిరంజీవి- నాగార్జున – వెంకటేశ్‌ మల్టీస్టారర్‌ గురించి మాట్లాడుకుంటే… 90ల్లో కొందరు అగ్ర దర్శక నిర్మాతలకు ఈ ఆలోచన వచ్చిందట. అప్పట్లో ఈ సినిమా గురించి తీవ్రంగానే చర్చలు జరిగాయట. అప్పట్లో బాలీవుడ్‌లో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్‌ ‘త్రిదేవ్‌’ (1989)… ఈ ఆలోచనలకు కారణం సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్, నసీరుద్దిన్‌ షా ప్రధాన పాత్రల్లో రాజీవ్‌ రాయ్‌ తెరకెక్కించిన సూపర్‌హిట్‌ చిత్రమది. ఆ యాక్షన్‌ థ్రిల్లర్‌ను చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌తో తెరకెక్కిస్తే బాగుంటుందని ఓ అగ్ర నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేసింది.

ముగ్గురు హీరోల ఇమేజ్‌లకు సరిపడే స్థాయిలో ఈ సినిమా ఉండటం, మూడు పాత్రలకు సేమ్‌ ప్రయారిటీ ఉండటంతో సినిమా ఓకే అవుతుంది అనుకున్నారు. ముగ్గురి హీరోలతో చర్చలు కూడా జరిగాయట. అయితే ఆ హీరోలు ఒప్పుకోలేదో, సరైన దర్శకుడు దొరకలేదో తెలియదు కానీ, ఈ మల్టీస్టారర్‌ వర్కౌట్‌ కాలేదు. అయితే తర్వాత కొన్నేళ్లకు ఈ సినిమాని సుమన్, భానుచందర్, అరుణ్‌ పాండ్యన్‌తో ‘నక్షత్ర పోరాటం’ పేరుతో తీసుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. దాని తర్వాత ఎప్పుడు చిరు – నాగ్‌ – వెంకీ మల్టీస్టారర్‌ అనే మాట వినిపించలేదు. ఆ మాటకొస్తే మల్టీస్టారర్‌ అనే మాటే వినిపించలేదు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus