కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో సినీ అభిమానులకు శంకర్ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ సక్సెస్ రేట్ ఎక్కువ కాగా ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల్ విజువల్ వండర్స్ గా నిలిచాయి. అయితే శంకర్ కు కెరీర్ తొలినాళ్ల నుంచి సపోర్ట్ చేసిన వాళ్లలో కథ, కథనంకు సంబంధించి సహాయం చేసిన వాళ్లలో సుజాత రంగనాథన్ కూడా ఒకరు. సుజాత రంగనాథన్ మరణం తర్వాతే శంకర్ ఖాతాలో ఫ్లాపులు చేరాయి.
అద్భుతమైన కథ, కథనం ఉంటే ఆ సినిమాను శంకర్ అద్భుతంగా తెరకెక్కించగలరు. శంకర్ సొంతంగా కథలు రాయగలిగినా ఆ కథలలో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. చరణ్ శంకర్ కాంబో మూవీకి కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించిన సంగతి తెలిసిందే. సుజాత రంగనాథన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుండగా రాబోయే రోజుల్లో శంకర్ మళ్లీ పూర్వ వైభవం సంపాదించుకుంటారో లేదో చూడాలి. శంకర్ సినిమాలు ఫ్లాప్ కావడం వెనుక అసలు ట్విస్ట్ ఇదేనని సమాచారం అందుతోంది.
స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కు కొత్త డైరెక్టర్లు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. చరణ్ శంకర్ కాంబో మూవీ బడ్జెట్ 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఈ సినిమా కూడా అంచనాలకు మించి విజయం సాధించి దిల్ రాజుకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తుందేమో చూడాలి. దిల్ రాజు మాత్రం తన ప్రతి ప్రాజెక్ట్ విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చరణ్ శంకర్ కాంబో సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. శంకర్ మరికొన్ని ప్రాజెక్ట్ లను ప్రకటించగా ఆ సినిమాలు ఎప్పుడు తెరకెక్కుతాయో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా చరణ్ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. శంకర్ ఇతర స్టార్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తారో లేదో చూడాలి.