ప్రస్తుతం మన దేశంలోనే టాప్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా రాజమౌళి (S. S. Rajamouli) పేరు సమాధానంగా చెప్పవచ్చు. వరుసగా 12 విజయాలను సొంతం చేసుకున్న రాజమౌళి ఈ సినిమాల ద్వారా నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించారు. తన సినిమాలలో హీరో పాత్ర విషయంలో జక్కన్న తీసుకునే జాగ్రత్తలు అన్నీఇన్నీ కావు. సినిమాలలో హీరో రోల్ చనిపోతే జక్కన్నకు అస్సలు నచ్చదట. అందువల్ల తన సినిమాలలో హీరో పాత్ర చనిపోయినా మరో హీరో పాత్ర బ్రతికి ఉండేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకుంటారు.
ఈగలో హీరో పాత్ర చనిపోయినా ఆ పాత్ర ఈగ రూపంలో బ్రతికే ఉంటుంది. బాహుబలి2 (Baahubali 2: The Conclusion) సినిమాలో అమరేంద్ర బాహుబలి, విక్రమార్కుడు (Vikramarkudu) సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలు చనిపోయినా మరో హీరో రోల్ బ్రతికి ఉండేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ట్రాజెడీ ఎండింగ్ ఈ స్టార్ డైరెక్టర్ కు అస్సలు నచ్చదట.
ఇలా హీరోల పాత్రల విషయంలో రాజమౌళి ఫిక్స్ అవ్వడానికి సీనియర్ ఎన్టీఆర్ నటించిన మంచి చెడు సినిమా కారణమట. ఈ సినిమాలో హీరో రోల్ చనిపోవడం జక్కన్నకు నచ్చలేదని తెలుస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత తన సినిమాలలో క్లైమాక్స్ లో మాత్రం ట్రాజెడీ ఎండింగ్ పెట్టకూడదని ఫిక్స్ అయ్యారట. ఆర్ఆర్ఆర్ లో (RRR) జెన్నీ పాత్రను చంపేయాలని భావించినా రాజమౌళి వెనుకడుగు వేయడానికి ఇదే కారణమట.
రాజమౌళి తన సినిమాలలో హీరోల పాత్రలను పవర్ ఫుల్ గా చూపిస్తారనే సంగతి తెలిసిందే. జక్కన్నకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా మహేష్ సినిమాను శరవేగంగా మొదలుపెట్టాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ (Mahesh Babu) సినిమాను భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్న జక్కన్న ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎప్పుడు అప్ డేట్స్ ఇస్తారో చూడాల్సి ఉంది.