Jr NTR: ‘దేవర’లో మోస్ట్‌ హైప్డ్‌ సీన్‌.. ట్రైలర్‌లో చూపించిన సీనేనా?

ట్రైలర్‌ చూసి సినిమా కథ చెప్పేయొచ్చు అని అంటే.. చాలామంది ఒప్పుకోరు కానీ.. చాలా వరకు అయితే సినిమాలోని మెయిన్‌ పాయింట్‌ని చెప్పేయొచ్చు. దానికితోడు సినిమా టీమ్‌ మీడియా ముందుకొచ్చి.. ‘ఫలానా సీన్‌ భలే ఉంటుంది మా సినిమాలో…’ అంటూ ఇంకాస్త ట్రైలర్‌ని డీప్‌గా చూసి ఆ పాయింట్‌ ఏంటో కూడా చెప్పేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి లాజిక్‌తోనే ఓ సినిమాలోని మెయిన్‌ పాయింట్‌ని చెప్పేస్తున్నారు. ఆ సినిమా ‘దేవర’ (Devara) కాగా.. ఆ సీన్‌ తారక్‌  (Jr NTR)  చెప్పిన 40 నిమిషాల సన్నివేశం.

Jr NTR

‘దేవర’ సినిమాలో ఆఖరి 40 నిమిషాలు అదిరిపోతాయి. థియేటర్‌లో జనాలు మామూలుగా ఎంజాయ్‌ చేయరు. థ్రిల్లింగ్‌కి బాబు లాంటి ఫీలింగ్‌ వస్తుంది అంటూ సినిమా టీమ్‌, తారక్‌ హైప్‌ ఇచ్చారు. మాకు తెలిసి సినిమా ప్రచారం మొత్తం ఆ 40 నిమిషాల సీన్‌ గురించే నడుస్తుంది. అయితే సినిమా ట్రైలర్‌ చూశా ఆ స్పెషల్‌ సీన్‌ ఏంటో తెలిసిపోయింది అంటున్నారు. ‘దేవర’ సినిమా మొత్తం దేవర వర్సెస్‌ భైర.. వర వర్సెస్‌ భైరనే ఉంటుంది అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

ఈ క్రమంలో ఆ ప్రాంతం మీద ఆధితప్యం చెలాయించడానికి దేవర, భైర మధ్య ఓ భారీ పోరాట సన్నివేశం ఉంటుంది. ట్రైలర్‌లో ఆ పోరాట సన్నివేశాన్ని మీరూ చూడొచ్చు. వివిధ కాలమాన పరిస్థితుల్లో ఆ యాక్షన్‌ సీన్‌ కనిపిస్తుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా అన్ని ఫ్రేమ్స్‌లోనూ ఆ ఫైట్‌ ఉంటుంది. అంతేకాదు ఆ ఫైట్‌ సగటు యాక్షన్‌ సీన్‌లా కాకుండా.. డిఫరెంట్‌గా కనిపిస్తుంది.

ఓ సన్నివేశంలో అయితే ఇద్దరి చేతులు ఒకదానికొకటి కట్టేసి ఉన్నాయి. మరో సీన్‌లో ఆ కట్టుకు మంట అంటించి ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఆ 40 నిమిషాల స్పెషల్‌ ఇదే అవ్వొచ్చు అని అంటున్నారు. చూద్దాం మరి తారక్‌ – కొరటాల ఏం చేస్తారో? ఇద్దరూ కలసి ఏదో మ్యాజిక్‌ ఉంటుందని మనకు తెలిసిన విషయమే.

 ‘ఆడవాళ్లు అంటే అంత చులకనా?’ అంటూ ‘మిస్టర్ బచ్చన్’ డైలాగ్ పై ట్రోలింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus