Jr NTR: నెగిటివ్ ట్రెండు నుంచి బయటపడ్డ తారక్.. ఈ లుక్ అదిరింది!

ఎన్టీఆర్ (Jr NTR) లుక్‌ గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. జెప్టో యాడ్‌ చూసిన తర్వాత అభిమానుల్లో కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. ఆయన హెయిర్‌స్టైల్, బాడీ లాంగ్వేజ్‌ ట్రోలింగ్‌కు గురికావడంతో, అసలు తారక్‌ కొత్త లుక్‌ ట్రై చేస్తున్నారా లేకపోతే ఇది కేవలం యాడ్‌ కోసమేనా? అనే ప్రశ్నలకు ఫ్యాన్స్‌ సమాధానం కోసం ఎదురుచూశారు. అయితే, తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఎన్టీఆర్ స్టైల్‌కి ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.

Jr NTR

ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ స్టైలిష్‌గా, క్యాజువల్ లుక్‌లో దర్శనమిచ్చాడు. సన్‌గ్లాసెస్, ట్రెండీ అవుట్‌ఫిట్‌లో కనిపించిన ఎన్టీఆర్‌ను చూసిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తాజాగా వైరల్‌ అవుతున్న ఈ లుక్‌ను బట్టి చూస్తే, ఎన్టీఆర్ ‘వార్ 2’ కోసం పూర్తిగా రెడీ అయ్యినట్లు స్పష్టమవుతోంది. బాలీవుడ్ స్టార్‌ హృతిక్‌ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి యశ్ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్‌ ప్రత్యేకమైన క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.

యాడ్‌లో లుక్‌ బాలేదని కామెంట్స్‌ చేసిన అభిమానులు కూడా ఇప్పుడు ఎన్టీఆర్‌ స్టైల్‌ గురించి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా జెప్టో యాడ్‌లోని లుక్‌ చూసి కొందరు అసంతృప్తిగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆయన లుక్ చూసిన తర్వాత అందరూ ఇది కేవలం యాడ్‌ కోసమేనని, అసలు గేమ్‌ ఇప్పుడు మొదలైందని అంటున్నారు. ఎన్టీఆర్‌ మేకోవర్‌, ఫిట్‌నెస్‌ లెవల్‌ను బట్టి చూస్తే ‘వార్ 2’లో అసలైన మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండబోతోందని అర్థమవుతోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ‘వార్ 2’ పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో మరో భారీ యాక్షన్‌ మూవీకి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ అనుకుంటున్నప్పటికీ, ఇంకో పవర్‌ఫుల్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. మొత్తం మీద ఎన్టీఆర్‌ టాలీవుడ్, బాలీవుడ్‌ మార్కెట్‌ను కలిపి తన కెరీర్‌ను ఒక కొత్త లెవెల్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

Court Review in Telugu: కోర్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus