Pawan Kalyan: ఆయన రియల్ స్టోరీ నే సినిమాగా తీశారా.. బయట పడ్డ నిజం..!

  • July 24, 2023 / 06:53 PM IST

సినిమా ఇండస్ట్రీలో తెరపై మనం ఎన్నెన్నో సినిమాలను చూస్తూ ఉంటాం . కొన్ని సినిమాలు నచ్చుతాయి కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి . మరికొన్ని సినిమాలు అభిమానులకి చిరస్థాయిగా గుర్తుండిపోతాయి . అయితే అలాంటి సినిమాలలో ఒకటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన తమ్ముడు సినిమా . ఈ సినిమా ఇప్పటికీ జనాలు టీవీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అంటే సినిమాలో ఎంత డెప్త్ ఉందో .. సినిమాకు ఎంత అట్రాక్ట్ అయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు .

ఒక సీన్ కాదు రెండు సీన్ కాదు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారు .పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తమ్ముడు సినిమా . ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బాక్సర్ గా మనకి కనిపిస్తాడు. పవన్ కళ్యాణ్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి రాత్రి మొత్తం వర్షం లో తడుస్తూ తనకి కిక్ బాక్సింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూపించారు . పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా తీసుకుని నటించిన ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీ అంటూ తెలుస్తుంది .

చెన్నైలోని కరాటే మాస్టర్ షెహాని హుస్సేన్ దగ్గర కరాటే నేర్చుకుంటానని పవన్ కళ్యాణ్ వెళితే ఇప్పుడు నేను ఖాళీగా లేను. అలాగే నేను ఈ మధ్యకాలంలో కరాటే నేర్పించడం మానేశానని వెళ్లిపోమన్నారట . కానీ పవన్ కళ్యాణ్ నేను కరాటే నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంటాను అని మొండి పట్టుదల పట్టి భీష్ముంచుకుని కూర్చున్నారట . ఇక క్రమంలోనే షహాని గారు ఓ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మార్నింగ్ ఐదు నుంచి నైట్ 11 వరకు నా దగ్గరే ఉండు ..

నేను ఖాళీగా ఉన్న టైంలో అర్థగంట నీకు కరాటే నేర్పిస్తాను అంటూ చెప్పుకొచ్చారట . అయితే పవన్ కళ్యాణ్ నిజంగానే అలాగే 15 రోజులపాటు మార్నింగ్ నుండి నైట్ వరకు ఆయన దగ్గరికి వెళ్లారట . పవన్ డెడికేషన్ చూసి ముచ్చట పడిన ఆయన .. సంవత్సరం పాటు కోచింగ్ ఇచ్చారు. బ్లాక్ బెల్ట్ కూడా పొందారు . కానీ ఆ తర్వాత కొన్ని నెలలకు ఆయనకి కల్యాణ్ ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అని తెలిసింది. తమ్ముడు సినిమా కూదా ఇలానే ఉంటుంది. అలా తన రియల్ స్టోరీనే రీల్ చూపించాడు (Pawan Kalyan) పవన్.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus