Tollywood: బంద్ వెనుక నిర్మాతల ముఖ్య ఉద్దేశం అదేనా.. నేరుగా చెప్పలేక ఇలా..?

ఆగస్టు 1 నుండి షూటింగ్ లు నిలిపివేస్తున్నట్టు ACTIVE TELUGU FILM PRODUCERS GUILD(ATFPG) ప్రకటించింది. కరోనా వల్ల సినీ పరిశ్రమ భారీగా నష్టపోయింది అని..! ఇప్పుడు పెరిగిన రేట్లతో మేకింగ్ కాస్ట్ బాలీవుడ్ సినిమాలను మించిపోతుందని, జనాలు కూడా థియేటర్లకు రావడం తగ్గించేసిన నేపథ్యంలో తాము(నిర్మాతలు) భారీ నష్టాల్లో ఉన్నట్టు ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ నిర్మాతలకు సహకరిస్తేనే ఏమైనా చేయగలం అన్నట్టు నిన్నటి మీటింగ్లో చర్చించుకున్నట్టు తెలుస్తుంది.

అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకునే వరకు బంద్ కొనసాగుతుంది అన్నట్టు కూడా వారు తెలియజేశారు. హీరోలు పారితోషికాలు తగ్గించుకోవాలి అన్నదే ఈ బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా సినీ కార్మికుల వేతనాలు అలాగే థియేటర్లకు జనం రావడం తగ్గిపోయారు.. వంటి కారణాలనే నిర్మాతలు హైలెట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 2020 డిసెంబర్ నుండి థియేటర్లు తెరుచుకున్నప్పుడు జనాలు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం మనం చూశాం.

సెకండ్ లాక్ డౌన్ పడే వరకు కూడా భారీగా జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూశారు. అయితే తమ సినిమాల మేకింగ్ కాస్ట్ పెరిగింది అని .. పెద్ద సినిమాల పేర్లు చెప్పి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాల వెంట తిరిగింది నిర్మాతలే. టికెట్ రేట్లు పెరిగిన తర్వాత.. సామాన్య ప్రేక్షకులు ‘సినిమాని.. థియేటర్లో చూడటం అనేది తలకు మించిన భారం గా’ భావిస్తున్నారు. ఇప్పుడేమో టికెట్ రేట్లు తగ్గించుకున్నాం.. థియేటర్లకు రండి అంటూ జనాలను బ్రతిమాలుతున్నది కూడా నిర్మాతలే.

ఈ విషయం పై మిడ్ రేంజ్ సినిమాలు నిర్మించే నిర్మాత.. నేరుగానే పెద్ద నిర్మాతల్ని ప్రశ్నించారని, మండిపడ్డారు అని వినికిడి. అన్నీ ఎలా ఉన్నా.. నిర్మాతలు షూటింగ్లు ఆపేస్తే ఎక్కువగా నష్టపోయేది నిర్మాతలే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాల కోసం ఫైనాన్సియర్ ల వద్ద డబ్బులు తెచ్చి ఉంటారు. వాటికి లక్షల్లో వడ్డీలు కడుతుంటారు. రిలీజ్ కు దగ్గర పడిన సినిమాలు ఉంటాయి. వాటి డబ్బింగ్ పనులు జరుగుతాయో లేదో తెలీదు.

ఒకవేళ జరగకపోతే వాటికి కూడా అదనపు ఖర్చులు. మరి తెలిసి తెలిసి ఇలాంటి తెలివితక్కువ నిర్ణయాన్ని నిర్మాతలు పాటిస్తారా? అనేది పెద్ద ప్రశ్న. బుధవారం నాడు మరో మీటింగ్ ఉంది అంటున్నారు కాబట్టి. ఇందులో వారు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus