ఇటీవల వచ్చిన ‘శశి’ చిత్రంతో వరుసగా 12వ ప్లాప్ ను మూటకట్టుకున్నాడు హీరో ఆది సాయి కుమార్. పోనీ అందులో రెండు యావేరేజ్ లు అనుకున్నా మొత్తానికి 10 ప్లాపులు ఉన్నాయి. అయినప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. సాధారణంగా ఏ హీరోకి అయినా ఇన్ని ప్లాప్ లు వస్తే.. జనాలు మర్చిపోవడం ఖాయం. కానీ ఆది విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఈ సినిమా కాకపోతే మరో సినిమా కొడతాడు అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.దర్శకనిర్మాతలు కూడా ఇతని పై నమ్మకం ఉంచుతున్నారు.
కారణం ఇతనిలో ట్యాలెంట్ ఉంది. డ్యాన్స్ లు,ఫైట్ లు అద్భుతంగా చెయ్యగలడు. అంతేకాకుండా ఇతని సినిమాలకు డబ్బింగ్ రైట్స్ రూ.6కోట్ల వరకూ వెళ్తాయట. ఇక థియేట్రికల్ మరియు శాటిలైట్ రైట్స్ కలుపుకుని మరో రూ.5కోట్ల వరకూ వెళ్తాయట. దాంతో సినిమాని పారితోషికాలతో కలుపుకుని రూ.4కోట్లలో ఫినిష్ చేసినా.. నిర్మాతకు లాభాలే. ఇక ఆదిలానే రాజ్ తరుణ్ కూడా సేమ్ ట్రాక్ లో ఉన్నాడు. వరుసగా 8 ప్లాప్ లు మూటకట్టుకున్నా.. ఈ హీరో నిత్యం సినిమాలతో బిజీగానే ఉంటున్నాడు.
గతేడాది ఓటిటిలో విడుదలైన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాని పక్కన పెట్టేస్తే.. ఈ మధ్యకాలంలో రాజ్ తరుణ్ కు హిట్టే లేదు. అయినప్పటికీ ఇతని సినిమాలకు డిజిటల్ రైట్సే రూ.4 కోట్ల వరకూ పలుకుతున్నాయి. ఇక థియేట్రికల్ మరియు శాటిలైట్ మరియు డబ్బింగ్ కలుపుకుంటే.. అవో 8 కోట్ల వరకూ ఉంటాయని తెలుస్తుంది. అందుకే ఆది, రాజ్ తరుణ్ లతో సినిమాలు చెయ్యడానికి దర్శకనిర్మాతలు ఎప్పుడూ సిద్దంగానే ఉంటున్నారు. ఎప్పుడైనా ఓ మంచి హిట్ ఇచ్చి కంబ్యాక్ ఇస్తే వీళ్ళు కూడా పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉంది.