సినీ పరిశ్రమకు చెందిన వారి ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ వ్యవహారాలు, రొమాన్స్ వ్యవహారాలు అలాగే విడాకుల వ్యవహారాలు… తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ప్రేక్షకులకి ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి చాలా చోట్ల జరుగుతూనే ఉన్నప్పటికీ.. ఇక్కడే బాగా హైలెట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి.. అలాగే అందరినీ ఆకర్షించే ఫీల్డ్ అని కూడా అనుకోవచ్చు. అందుకే ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటి వ్యవహారాలు సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి.
ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలు కూడా ఎక్కువగా వింటూ వస్తున్నాం. నిహారిక వంటి సెలబ్రిటీలు విడాకులకు సిద్ధమయ్యారు. వేరే ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపించాయి. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ప్రముఖ నటి సోఫీ టర్నర్.. జో జోనస్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయంతో ఈమె కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నాలుగేళ్ల తమ (Star Actress) వివాహానికి అధికారికంగా స్వస్తి చెప్పారు సోఫీ టర్నర్ – జో జోనస్..!
ప్రస్తుతం ఈ దంపతులు సెపరేట్ గా జీవిస్తున్నారు. ఈ విషయం చర్చల్లో ఉండగానే.. సోఫీ మరో నటుడికి ఘాటు లిప్ లాక్ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. విడాకుల తర్వాత తన సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతోంది. తన నెక్స్ట్ షో ‘జోన్’ చిత్రీకరణలో పాల్గొంటుంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా జోన్ హన్నింగ్టన్ రోల్ ప్లే చేస్తున్న సోఫీ.. ఫ్రాంక్ డిల్లాన్ తో ఘాటు లిప్ లాక్ లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.