Tamannaah: ‘భోళా’ ప్రీరిలీజ్‌కి తమన్నా డుమ్మా… ఏం కారణం చెబుతుందో ఏంటో?

చిరంజీవి సినిమాకు హీరోయిన్లు దొరకడం కష్టం అంటుంటారు. ఆ మాటకొస్తే సీనియర్‌ స్టార్‌ హీరోలకు ఈ సమస్య ఉంది అనుకోండి. అయితే చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నా.. హీరోయిన్లు అంత ఈజీగా ఓకే అవ్వడం లేదు. ఇదొక సమస్య అయితే.. చిరంజీవి సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హీరోయిన్లు డుమ్మా కొట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కావాలంటే మీరే చూడండి ‘భోళా శంకర్‌’ ప్రీరిలీజ్‌కి తమన్నా డుమ్మా కొట్టింది.

ఈ విషయం గురించి మాట్లాడే ముందు ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ సినిమా ఈవెంట్‌కి హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ డుమ్మా కొట్టింది. అంతకుమందు రోజు జరిగిన మరో సంక్రాంతి సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హాజరైన శ్రుతి.. ‘వాల్తేరు వీరయ్య’కు డుమ్మా కొట్టింది. దానికి ఆమె తొలుత కారణం చెప్పలేదు కానీ… చిరంజీవి అయితే ఏదో అనారోగ్యం అని, భయపెట్టారు అని చెప్పారు. అయితే ఆయన జోక్‌గా అన్నారేమో కానీ.. ఏదో జరిగింది అనే విషయం మాత్రం తెలిసింది.

ఇప్పుడు ‘భోళా శంకర్‌’ సినిమా ఈవెంట్‌కి తమన్నా డుమ్మా కొట్టింది. ఎందుకు రాలేదు అనే విషయంలో చిరంజీవి ఏమన్నా చెబుతారేమో అనుకున్నారు కానీ.. ఆయనేం చెప్పలేదు. అయితే కీర్తి సురేశ్ పొగడ్తల వేడుకగా సాగే కార్యక్రమంలో ఎందుకు అనుకుందేమో ఈ వేడుకకు రాలేదు అనే కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే తమన్నా ఇలా ఎప్పడూ చేయలేదు అని చెప్పాలి. ఇద్దరు హీరోయిన్లు నటించిన సినిమా అయినా ఆమె ప్రచారానికి వస్తుంది. అలాంటిది ఇప్పుడు ఎందుకు రాలేదు అనేది తెలియడం లేదు.

అయితే ఈ ఈవెంట్‌కి ముందు జరిగిన ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో తమన్నా (Tamannaah) పాల్గొంది. కానీ ఈవెంట్‌కి మాత్రమే రాలేదు. అంతేకాదు ‘సైరా’ సినిమాలో నయనతారతో కలసి హీరోయిన్‌ పోస్ట్‌ షేర్‌ చేసుకున్నప్పుడు కూడా తమన్నా ఆ సినిమా ఈవెంట్‌కు వచ్చింది. నయనతార ఈవెంట్‌కి రాకపోయిన విషయం మీద కౌంటర్‌ వేసింది. కాబట్టి ‘భోళా’ ఈవెంట్‌కి రాకపోవడం వెనుక కారణం ఉంది అనుకోవచ్చు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus