2021 ఏప్రిల్ లో విడుదలై సూపర్ హిట్ అయిన మలయాళం మూవీ ‘నాయట్టు’ ని తెలుగు రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ ను కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా అక్కడి నిర్మాతకి భారీ లాభాలను అందించింది. సినిమాలో కూడా 3,4 లొకేషన్లు మాత్రమే కనిపిస్తాయి.కాబట్టి రీమేక్ కు సంబంధించిన షూటింగ్ 2 షెడ్యూల్స్ లో ఫినిష్ చేసే ఆస్కారం ఉంది.అందుకే అల్లు అరవింద్ గారు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ముందుకు వచ్చారు.
రావు రమేష్, అంజలి వంటి వారిని ప్రధాన పాత్రలకి ఎంపిక చేసుకున్నారు. ‘పలాస’ ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి చిత్రాల దర్శకుడు కరుణ కుమార్ ఈ రీమేక్ ను తెరకెక్కించాల్సి ఉంది. కానీ కరుణ కుమార్ ఈ చిత్రం బడ్జెట్ ను రూ.8 కోట్లకి పెంచాడట. అందులో అతని పారితోషికమే రూ.1.25 కోట్ల వరకు ఉందట. ఇక రావు రమేష్ కు ఏకంగా రూ.1 కోటి ఇవ్వాల్సి ఉందట. అరవింద్ గారు ఈ చిత్రం రీమేక్ కోసం కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ మాత్రమే అనుకున్నారట.
బడ్జెట్ ఎక్కువ అవుతుండడంతో అరవింద్ గారు వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. డబ్బింగ్ రైట్స్ కూడా అరవింద్ గారి వద్దే ఉన్నాయట.కాబట్టి.. తెలుగులో ఈ చిత్రాన్ని డబ్ చేసి ‘ఆహా’ లో విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఈ మెగా ప్రొడ్యూసర్ ఉన్నట్టు సమాచారం. దర్శకుడు కరుణ కుమార్ కు అడ్వాన్స్ ఇచ్చేసారు కాబట్టి.. అతన్ని వేరే ప్రాజెక్టుకి పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ఇన్సైడ్ టాక్.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!