దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినిమా రంగంలో నటుడిగా సత్తా చాటడంతో పాటు ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ చిరంజీవి అభిమానులను సంపాదించుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి పాలిటిక్స్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా చిరంజీవి ఎంతో మందికి సేవ చేస్తుండటం గమనార్హం.
కరోనా బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. చిరంజీవి తీసుకుంటున్న నిర్ణయాలను సోషల్ మీడియా, వెబ్ మీడియాతో పాటు సామాన్య ప్రజలు సైతం ప్రశంసిస్తున్నారు. నెటిజన్లు చిరంజీవి గొప్పదనాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీలకు చెందిన మంత్రులు మాత్రం చిరంజీవి సేవలను గుర్తించడం లేదు. ఒక పత్రికాధినేతతో చిరంజీవి మాట్లాడుతూ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు విషయంలో మంత్రులు స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆగష్టు నెలలో ఆచార్య సినిమా రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!